దిశ రవికి బెయిల్ : దేశంలో ఉండాలంటే బానిస బతుకులు తప్పవా..?

టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా మంగళవారం ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.లక్ష వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తుతో ఆమెను విడుదల చేయాలని ఆదేశించారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలపై ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా టూల్‌కిట్‌ను షేర్ […]

Written By: Srinivas, Updated On : February 24, 2021 3:38 pm
Follow us on


టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా మంగళవారం ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.లక్ష వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తుతో ఆమెను విడుదల చేయాలని ఆదేశించారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయకపోవడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలపై ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా సోషల్ మీడియా ద్వారా టూల్‌కిట్‌ను షేర్ చేసినట్టు దశ రవి అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

Also Read: కుప్పంలో కుప్పకూలడానికి ఆ త్రిమూర్తులే కారణమట..? : ఫైర్‌‌ అయిన తమ్ముళ్లు

ఖలిస్తాన్ పేరుతో ఆమెపై మోపిన అభియోగాలకు ఆధారాలు లేవని తేల్చింది. దేశద్రోహం కేసు పెట్టడాన్ని తప్పు పట్టింది. దీంతో దేశంలో న్యాయవ్యవస్థపై చాలా మందికి పోతున్న నమ్మకం నిలబడింది. దిశా రవి కేసు గురించి కనీసం ప్రాథమిక సమాచారం తెలిసినా ఆమె కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. రైతులకు మద్దతు తెలిపినందుకు .. గ్రెటా ధన్ బర్గ్ ఆలోచనతో పురుడు పోసుకున్న ఓ పర్యావరణ స్వచ్ఛంద సంస్థకు పని చేయడం ఆమె చేసిన నేరమా..? రైతుల ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో ఉన్న ఓ టూల్ కిట్‌లో తన అభిప్రాయాన్ని పంచుకోవడం ఆమె చేసిన పాపమా..? దీనికే ఈ 21 ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు.. ఉద్యమకారిణిపై కేంద్రం ఏకంగా దేశద్రోహం కేసులు పెట్టింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. వారి డిమాండ్ మేరకు రైతు చట్టాలను రద్దు చేయడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఇక రైతుల్ని వెనక్కి పంపాలి. కానీ.. అలా పంపడానికి కేంద్రం వేస్తున్న ఎత్తులు భయంకరంగా ఉన్నాయి. వారిపై ఖలిస్తాన్ ముద్ర వేశారు. అసలు దేశంలో లేని ఖలిస్తాన్ అనే వేర్పాటు వాదాన్ని కేంద్రం ఈ విధంగా ప్రోత్సహించింది. దేశద్రోహానికి పాల్పడుతోంది. రైతులకు ఖలిస్తాన్‌కు ఏం సబంధంమో.. కేంద్రం చెప్పలేదు. కానీ.. రైతులకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరిపై ఖలిస్తాన్ సపోర్టర్ల ముద్ర వేసి దేశద్రోహం కేసులు పెట్టడానికి వెనక్కి తగ్గడంలేదు.

Also Read: టీటీడీ ఉద్యోగుల కల సాకారం : అందరికీ స్థలాలు

దిశా రవి కేసు అందులో ఒకటి. భయపెట్టి ఇతరులెవరూ నోరు తెరవకుండా ఉండే లక్ష్యంతోనే కేంద్రం ఈ దురాఘాతానికి పాల్పడింది. ఒక్క దిశా రవి కేసు మాత్రమే కాదు ఏ రాష్ట్రంలో చూసినా.. చట్టాలను దుర్వినియోగం చేసి.. ప్రజలను ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారందరిపై కేసులు పెట్టి.. జైళ్లలో వేస్తున్నారు. చట్టాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. పాలక పార్టీల చేతుల్లో ప్రజల్ని వేధించడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసుల చట్రం విరుచుకుపడుతోంది. దేశంలో ఇప్పుడు యువత ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితి ఇది. ఈ దేశంలో ఉండాలంటే బానిసలా బతకాల్సిన పరిస్థితులే ఉన్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్