https://oktelugu.com/

అమెరికాలో భారతీయుల పరిస్థితి ఇదా?

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు వారి కంపెనీల సారథులగా ఎంత పైకి ఎదిగినా సరే కింద స్థాయిలో మాత్రం భారతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉందని తేలింది. అమెరికాలో వలస వచ్చిన వారిపై ఆ జాత్యాహంకారం ఇంకా పోలేదని మరోసారి సర్వేలో తేలింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న సగం మంది భారతీయులు ఈ వివక్షకు గురయ్యారన్న వాస్తవం విస్తుగొలుపుతోంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లాలని కలలుగంటారు. అగ్రరాజ్యం అమెరికా అంటే అందరి కల. వలస వచ్చిన వారితోనే ఇప్పుడా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2021 10:34 am
    Follow us on

    అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు వారి కంపెనీల సారథులగా ఎంత పైకి ఎదిగినా సరే కింద స్థాయిలో మాత్రం భారతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉందని తేలింది. అమెరికాలో వలస వచ్చిన వారిపై ఆ జాత్యాహంకారం ఇంకా పోలేదని మరోసారి సర్వేలో తేలింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న సగం మంది భారతీయులు ఈ వివక్షకు గురయ్యారన్న వాస్తవం విస్తుగొలుపుతోంది.

    ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లాలని కలలుగంటారు. అగ్రరాజ్యం అమెరికా అంటే అందరి కల. వలస వచ్చిన వారితోనే ఇప్పుడా దేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. అయితే ఎన్ని ఏళ్లు అయినా కూడా అక్కడ పరాయి దేశస్థుల విషయంలో జాత్యాహంకారం మాత్రం పోవడం లేదని తాజాగా ఒక సర్వేలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. మనోళ్ల కులం, మతం కట్టుబాట్లు కూడా అమెరికన్ల ఆగ్రహానికి వారు వివక్ష చూపడానికి కారణమవుతోందని తేలింది.

    అమెరికన్లు ముఖ్యంగా భారతీయులను అవమానించేందుకు ఎంచుకుంటున్నది మన రంగు, భాష, వేషధారణ కావడం గమనార్హం. తమ చర్మం రంగుకు సంబంధించి తరచూ అవహేళనకు గురి అవుతుంటామని అమెరికాలోని భారతీయులు ఈ సర్వేలో ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడి దేశ పౌరులుగా మారిన వారు మాత్రమే కాదు.. అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయుల పరిస్థితి కూడా ఇదేనని చెప్పటం గమనార్హం. భారతీయ తండ్రి – అమెరికా తల్లి, భారతీయ తల్లి – అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటున్నట్లు వాపోవటం గమనార్హం.

    ‘‘కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్, జాన్స్‌ హాప్కిన్స్‌–ఎస్‌ఏఐఎస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియా’’ సంయుక్తంగా ఒక సర్వేను గత ఏడాది నిర్వహించాయి. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1200 మంది భారతీయ అమెరికన్లను ఆన్ లైన్ ద్వారా ప్రశ్నించారు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఈ సర్వే రిపోర్టును రూపొందించారు. తాజా రిపోర్టులో ప్రధానంగా ప్రస్తావించిన అంశం.. ప్రతి ఇద్దరిలో ఒకరు తాము అమెరికాలో వివక్షను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు.

    కులాన్ని,మతాన్ని కూడా భారతీయ అమెరికన్లు విడిచిపెట్టటం లేదన్న విషయం తాజా సర్వేలో వెల్లడైంది.ఇండియాలో పుట్టి అమెరికాకు వెళ్లిన వారు తమ పేరుతో పాటు.. తాము ఏ కులానికి చెందిన వారిమన్న విషయాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదని తేలింది. రోజుకు ఒకసారైనా ప్రార్థన చేస్తామని 40 శాతం మంది చెబితే.. వారంలో ఒక్కరోజైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27 శాతం మంది చెప్పటం గమనార్హం.

    ఇలా మన సంప్రదాయాలు, మన రంగు, ఇతర సంస్కృతి వల్ల అమెరికాలో వివక్షకు గురవుతున్నట్టు సర్వేలో సంచలన నిజాలు వెలుగుచూశాయి.