https://oktelugu.com/

ఇల్లు లేని పేదలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?

  కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇల్లు లేని పేదలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా ఏకంగా 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కేంద్ర కేటాయింపులు, పర్యవేక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అర్బన్ ఏరియాలలో నివశించే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 10, 2021 / 10:01 AM IST
    Follow us on

     

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇల్లు లేని పేదలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా ఏకంగా 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కేంద్ర కేటాయింపులు, పర్యవేక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    అర్బన్ ఏరియాలలో నివశించే వాళ్లకు కేంద్రం బహుళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించనుందని సమాచారం. ఇళ్ల నిర్మాణం కొరకు 708 ప్రతిపాదనలు రాగా ఆ ప్రతిపాదనలకు ఈ సందర్భంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ను సక్రమంగా అమలు చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు అవార్డులు ఇవ్వనుంది.

    ఇప్పటివరకు ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ఏకంగా 112.4 లక్షల ఇళ్లను మంజూరు చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏకంగా 7.35 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ స్కీమ్ కింద 82.5 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా 48.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడం గమనార్హం. ఈ స్కీమ్ లో కేంద్రం వాటా 1,81,000 కోట్ల రూపాయలుగా ఉంది. మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.

    కేంద్రం 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పట్టణాల్లో ఉన్న పేదలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పట్టణ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.