Petrol Price: పెట్రో ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ద్విచక్ర వాహన వినియోగదారులకు పెట్రోల్ పై రాయితీ అందించనుంది. పెట్రోల్ పై రూ.25 లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

గతంలోనే కేంద్రం పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై వ్యాట్ తగ్గించినా బీజేపీ పాలిత స్టేట్లు తప్ప మిగతా స్టేట్లు పెట్రో ధరలు తగ్గించలేదు. ఫలితంగా వినియోగదారులపైనే భారం పడుతోంది. దీన్ని ఏ రాష్ర్టం కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. దీంతో ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలకు మేలు జరగనుంది.
Also Read: జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు రఘురామ.. ఏం జరుగనుంది?
కానీ మన రాష్ర్టం మాత్రం పెట్రో బాదుడుకే ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్రం వ్యాట్ తగ్గించినా మేం తగ్గించమని సిగ్గు లేకుండా చెబుతోంది. దీంతో అసలు నిందలు కేంద్రంపై మోపుతూ రాష్ర్టమేమో ఎడాపెడా ప్రజాధనం తీసుకోవడానికి సిగ్గు పడటం లేదు. పైగా కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని ఉద్యమిస్తూ తాము మాత్రం మంచివారమని చెప్పుకునే దౌర్బాగ్యం మన సీఎందే.
జనవరి 26, 2022 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుంది. ప్రతి పేద కుటుంబం నెలకు 10 లీటర్ల వరకు రీయింబర్స్ మెంట్ పొందుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98 గా ఉంది. దీంతో అక్కడి ప్రజలు పెట్రో భారం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఏర్పడింది.
Also Read: జగ్గారెడ్డి లేఖపై అధిష్టానం స్పందిస్తుందా?