Tollywood: పొరుగింటి పుల్ల కూర రుచిగా ఉంటుంది. కూరే కాదు, చాలా మందికి చాలా విషయాల్లో పొరుగింటి పక్కింటి లాంటి చోట్ల ఎక్కువ రుచి అనిపిస్తుంది. సినిమా రంగం కూడా ఇందుకు అతీతం కాదు. తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు గొప్పవి, అద్భుతమైనవి అంటూ ఎప్పటి నుంచో ఓ టాక్ ఉంది. అందులో నిజం ఎంత ఉందనేది పట్టించుకోరు, కానీ, ఎక్కువమంది ఆ టాక్ నిజమే అంటూ ముందుకు పోతారు.

అసలు వాస్తవానికి తెలుగు సినిమాలకి మళయాళ సినిమాకి ఎక్కడా పోలిక ఉండదు. కథలు వేరు, కథనాలు వేరు. అలాగే ప్రేక్షకుల అభిరుచులు కూడా వేరు. ఇక హీరోల టేస్ట్ కూడా పూర్తిగా వేరు. ఒక్క మాటలో చెప్పుకుంటే.. తెలుగు సంస్కృతి కి, మళయాళ సంస్కృతికి చాలా తేడా ఉంది. అదే సినిమాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. కాకపోతే మనకు పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టుగా మనకు మలయాళ సినిమాలు గొప్పవి అనిపిస్తాయి.
Also Read: బాలయ్య విలన్ అతనే.. ఇక సంజయ్ దత్ లేనట్టే !
కానీ, మలయాళ ప్రేక్షకులకు తెలుగు సినిమాలు గొప్పవి అనిపించవు. ఒకవేళ అనిపించినా, వాళ్ళు బయట పెట్టరు. బాహుబలి లాంటి సినిమా విషయంలో కూడా వాళ్ళు ఉత్సాహం కనబర్చలేదు. అదే మన వాళ్ళు మాత్రం.. మలయాళంలో ఏ చిన్న సినిమా హిట్ అయినా దాన్ని అద్భుతం అనేస్తారు. మన తెలుగు వాళ్లకు ఈ విషయంలో విశాలమైన మనసు ఎక్కువ.
ఇక సినిమాల పరంగా కూడా చాలా తేడా ఉంది. మలయాళ సినిమాలు గోలగా, స్పీడ్ గా ఉండవు. పైగా సినిమా మొత్తం అసలైన కేరళా సంస్కృతిని, సహజమైన లొకేషన్స్ ను చూపిస్తారు. ఇక మలయాళ సినిమా ఇతివృత్తాలు కూడా చాలా ప్రగతి శీలకంగా ఉంటాయి. కానీ తెలుగు సినిమాల విషయానికి వస్తే, అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ అంతా హీరో ప్రధానమైన సినిమాలే ఎక్కువ.
పైగా మన హీరోలు, మరో హీరోల హీరోయిజాలు బాగా లౌడ్ గా ఉంటాయి. దీనికి తోడు మన సినిమాల్లో రకరకాల పాత్రలు ఉంటాయి. ఇక ఆ పాత్రలతో సంబంధం లేకుండా రెండు మూడు కామెడీ ట్రాక్స్ ఉంటాయి. అలాగే ఓవర్ యాక్షన్ సీన్స్, రొమాంటిక్ పాటలు ఇలా రెండు రెండున్నర గంటల పాటు మసాలా అంతా ఒక చోట చేర్చబడి తెలుగు సినిమాగా బయటకు వస్తోంది. కానీ తెలుగు సినిమాల్లో కూడా గొప్ప సినిమాలు వస్తున్నాయి. అటు మలయాళ సినిమాల్లో కూడా కొన్ని గొప్ప సినిమాలు వస్తున్నాయి.
Also Read: ఆర్ఆర్ఆర్ పై ఢిల్లీ ఎఫెక్ట్.. అయినా రిలీజ్ ఖాయం.. కారణం అదే!