కాలి కట్టే మమతా ఎన్నికల అస్ర్తమా..?

బెంగాల్ లో బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంగా కంట్రోల్ తప్పి పోతున్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మమతా బెనర్జీ కాలికి కట్టుతోనే ప్రచారం చేస్తుండడం బీజేపీ నేతలను అసహనానికి గురి చేస్తోంది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ నామినేషన్ రోజున తనపై దాడి జరిగిందని ఆరోపించారు. కాలికి దెబ్బ తగలడంతో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని.. తరువాత వీల్ చైర్ పై తన ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి వీల్ చైర్ […]

Written By: Srinivas, Updated On : March 26, 2021 2:29 pm
Follow us on


బెంగాల్ లో బీజేపీ నేతలు ఎన్నికల సందర్భంగా కంట్రోల్ తప్పి పోతున్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మమతా బెనర్జీ కాలికి కట్టుతోనే ప్రచారం చేస్తుండడం బీజేపీ నేతలను అసహనానికి గురి చేస్తోంది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ నామినేషన్ రోజున తనపై దాడి జరిగిందని ఆరోపించారు. కాలికి దెబ్బ తగలడంతో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని.. తరువాత వీల్ చైర్ పై తన ప్రచారాన్ని ప్రారంభించారు.

అప్పటి నుంచి వీల్ చైర్ పైనే కాలికి కట్టు అందరికీ కనిపించేలా ప్రచారం చేస్తుండడంతో బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మమతా బెనర్జీ కాలికట్టు ఇంకా బాగా కనిపించేలా ఉండాలంటే.. బెర్ముడా షార్ట్స్ వేసుకోవాలని ఓసారి సలహా ఇచ్చారు. మరోసారి మమతా బెనర్జీ కాళ్లను చూపిస్తూ.. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను కించపరుస్తున్నారని విమర్శించారు.

దాలీప్ ఘోష్ విమర్శలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి. ఆయనపై తృణముల్ నేతలు విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేతల తీరే అంత అని మండి పడుతున్నారు. మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేయడంతో ఆమెకు ఎక్కడ ప్రజల్లో సానుభూతి పెరుగుతుందోనని బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది. దీంతోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నేతల అసహనాన్ని టీఎంసీ నేతలు మరింత ఎక్కువగా రాజకీయంగా వినియోగించుకంటున్నారు.

వారు మహిళలను కించపరుస్తున్నారని.. గౌరవించడం లేదంటూ.. విమర్శలకు దిగుతున్నారు. మమతా బెనర్జీ కూడా బీజేపీ నేతల తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. చిన్న గాయానికే.. పెద్దకట్టు కట్టుకుని సానుభూతికోసం మమతా బెనర్జీ డ్రామాలు ఆడుతున్నారనేది.. బీజేపీ నేతల బాధ. ఈ నేపథ్యంలో మమతా కాలికట్టు ఎన్నికల అస్ర్తంగా మారి బీజేపీ పార్టీని భారీగానే దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.