
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని తానై నిర్వహిస్తున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. స్వామి కార్యం నుంచి స్వకార్యం వరకు అన్నింటా తన ముద్ర ఉండాల్సిందే. ప్రభుత్వ పని ఏదైనా అది ఆయన నోటి నుంచి వెలువడ్డాకే జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. పార్టీలో ఆయనకు అంత పట్టుంది. జగన్ దగ్గర పలుకుబడి ఉంది. దీంతో ఆయన చెప్పిందే వేదం. చేసిందే శాసనంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై పలు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
ఇటీవల ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో ఉండగా ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది సజ్జల నుంచే వచ్చినట్లు తెలిసింది. కానీ ఆయన మాట్లాడింది ఏమిటన్న దానిపైనే చర్చ జరుగుతోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ గురించి మాట్లాడేందుకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచి ఫోన్ రావడంతో మాట్లాడారు. అయితే ఆయన ఎందుకు ఫోన్ చేశారు? ఈయన ఏం మాట్లాడారనేదానిపైనే చర్చ సాగుతోంది.
దీనికి శ్రీనివాస్ మాత్రం తనకు మంచి ఉద్దేశంతోనే ఫోన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరు ఐకమత్యంగా ఉండాలని సూచించినట్లు చెప్పినట్లు చెప్పడం గమనార్హం. తనను బెదిరించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బుకాయిస్తున్నారు. అదంతా మీడియా కట్టుకథ అని కొట్టిపారేస్తున్నారు. దీనిపై ఆయన ఘాటుగానే స్పందిస్తున్నారు.
నేతల మధ్య ఘర్షణలొద్దని సూచించినట్లు చెబుతున్నారు. తమ బంధంపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సలహాదారు అయిన ఆయన ప్రభుత్వానికి సలహాలివ్వడం మానేసి అన్ని పనులు చక్కబెట్టడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అవి జగన్ వరకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయనపై ఎలాంటి చర్య తీసుకోవడానికి ముందుకు రావడం లేదని సమాచారం. ఏదిఏమైనా సజ్జల దూకుడుకు అడ్డుకట్ట పడే అవకాశముందా ఏమో వేచి చూడాల్సిందే.