APERC: ఏపీ ప్రభుత్వం విద్యుత్ ట్రూప్ ఆఫ్ చార్జీల పేరిట కరెంటు బిల్లులు బాదేస్తోంది. రెండు నెలల నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారు. అయితే హఠాత్తుగా ఈ విషయంలో సర్కారు వెనక్కి తగ్గింది. ఆ చార్జీల వసూళ్లకు సంబంధించిన ఉత్తర్వులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించేసింది. ఏపీ ఈఆర్సీ అంటే.. ఆంధ్రప్రదేశ్ ఎలక్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచాలన్నా.. తగ్గించాలన్న ట్రూ ఆఫ్ లాంటి పేరుతో చార్జీలు వసూలు చేయాలన్నా.. ఏపీఈఆర్సీ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే..

ఏపీ ఈఆర్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తన సన్నిహితుడైన మాజీ న్యాయమూర్తి సీవీ నాగార్జున రెడ్డిని చైర్మన్ గా నియమించారు. ఈ మధ్యకాలంలో నాగార్జున రెడ్డి నేతృత్వంలోని ఏపీ ఈఆర్సీ ప్రజల నుంచి ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేసుకోవచ్చని ఉత్వర్వులు సైతం ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చులు.. ఇతర ఖర్చులను వీటి రూపంలో వసూలు చేయాలని సంస్థలు కోరాయి.
వెంటనే ఏపీ ఈఆర్సీ రూ.3600 కోట్లు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది. మొన్నటి సెప్టెంబరు మాసం నుంచి ఈ వసూళ్ల పర్వం ప్రారంభం అయ్యింది. ఏపీ ఈఆర్సీ ఎంత రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ.. ఇష్టారాజ్యంగా పనిచేస్తానంటే కుదరదు. నిబంధనల మేరకే.. చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. పని కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఒక వేళ్ల.. చార్జీలు పెంచాలన్నా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే కుదరదు. నిబంధనల మేరకే పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ ప్రక్రియ ప్రకారం ముందుకు సాగాలి. పేపర్లలో ముందస్తు ప్రకటన ఇవ్వాలి. ప్రాజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. తరువాత అనుమతి ఇవ్వాలి. కానీ.. ఏపీ ప్రభుత్వం విషయంలో ఇలాంటి అంశాలు ఏవీ జరగలేదు. ఎవరినీ అడగకుండానే చార్జీలు పెంచేశారు. దీంతో కొందరు హైకోర్టు మెట్లు ఎక్కారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టు మొట్టికాయలు వేస్తుందని ముందు జాగ్రత్తగా ట్రూ ఆఫ్ చార్జీలపై వెనక్కి తగ్గారు. అయితే వడ్డింపు మాత్రం ఆపకుండా.. 19న ప్రజాభిప్రాయ సేకరణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమా అనిపించేయనున్నారు.