KCR-Chinna Jeeyar: కేసీఆర్ కు చినజీయర్ స్వామికి మధ్యలో దూరం పెరిగిందా?

KCR-Chinna Jeeyar:  యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన పనులన్ని ఇప్పటి వరకు ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి నేతృత్వంలోనే జరిగాయి. కానీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. విభేదాలు పెరిగాయి. దీంతో ఇద్దరు ఎడమొహం పెడమొహంలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో చినజీయర్ స్వామి పేరు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం విషయంలో ఏం జరిగిందనే […]

Written By: Srinivas, Updated On : March 21, 2022 5:14 pm
Follow us on

KCR-Chinna Jeeyar:  యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన పనులన్ని ఇప్పటి వరకు ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి నేతృత్వంలోనే జరిగాయి. కానీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. విభేదాలు పెరిగాయి. దీంతో ఇద్దరు ఎడమొహం పెడమొహంలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో చినజీయర్ స్వామి పేరు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

KCR-Chinna Jeeyar

యాదాద్రి ఆలయ పున: ప్రారంభం విషయంలో ఏం జరిగిందనే దానిపై ఇదివరకే తెలిసిందే. సమతామూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకంలో కేసీఆర్ పేరు లేదని అలకబూని జీయర్ స్వామిని దూరంగా పెడుతున్నట్లు సమాచారం. అందులో తమ తప్పేమీ లేదని ఆరోజు వచ్చిన వారి పేర్లు అందులో చేర్చామని కేసీఆర్ ను అడిగితే తాను రావడం లేదని చెప్పడంతోనే ఆయన పేరు పొరపాటున వేయలేనది వివరణ ఇచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం అప్పటి నుంచి చినజీయర్ స్వామిని కావాలని దూరంగా ఉంచుతున్నట్లు అనుమానిస్తున్నారు.

Also Read: KCR Vs BJP: కేంద్రంతో రణమా.. శరణమా! కేసీఆర్ ప్లాన్ ఏంటి?

తనకు ఎవరిపైనా కోపం లేదని ఎవరైనా కావాలని అలా ప్రవర్తిస్తే అది తమ తప్పు కాదని చెబుతున్నారు. కేసీఆర్ తో విభేదాలున్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన అవుననే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. భక్తులంతా తమకు ఒక్కటేనని స్వామి సెలవిస్తున్నారు. ఎవరైనా కావాలని తమపై ఆగ్రహం పెంచుకుంటే తాము ఏం చేయలేమని చెబుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలో ఏదో అభద్రతా భావం కనిపిస్తోందని చెప్పారు.

KCR-Chinna Jeeyar

యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందకపోవడంలో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తోంది కేసీఆర్ కావాలనే స్వామిని దూరంగా పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు జీయర్ స్వామి విషయంలో కేసీఆర్ ఏం మాట్లాడటం లేదు. ఆయన ఎందుకు రాలేదనేదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. వ్యక్తిగత దురుద్దేశాలతోనే కేసీఆర్ ఇలా ప్రవర్తిస్తున్నారని జీయర్ స్వామి అన్నారు. తాము సమాజానికి కళ్ల లాంటి వారిమని అందరిని సమాన భావంతోనే చూస్తామని చెబుతున్నారు.

Also Read: YCP vs BJP: జగన్ పై జగడానికే బీజేపీ రెడీనా?

Recommended Video:

Tags