https://oktelugu.com/

TRS MPs: టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం బెడిసి కొట్టిందా?

TRS MPs: తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల రిజల్ట్ తర్వాత సీఎం కేసీఆర్ సైతం నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును బాదానం చేసేలా ధాన్యం కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మాటలతూటలు పేలుతున్నాయి. అయితే పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టడంతో ప్రతిపక్ష పార్టీలకు టీఆర్ఎస్ టార్గెట్ గా మారినట్లు కన్పిస్తోంది. ఇటీవలే పార్లమెంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2021 / 12:28 PM IST

    CM KCR

    Follow us on

    TRS MPs: తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల రిజల్ట్ తర్వాత సీఎం కేసీఆర్ సైతం నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును బాదానం చేసేలా ధాన్యం కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మాటలతూటలు పేలుతున్నాయి. అయితే పార్లమెంట్ లో టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టడంతో ప్రతిపక్ష పార్టీలకు టీఆర్ఎస్ టార్గెట్ గా మారినట్లు కన్పిస్తోంది.

    KCR

    ఇటీవలే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు అంశంపై నిలదీసే ప్రయత్నం చేశారు. తొలి వారం రోజులు ప్లకార్డులు, నినదాలతో పార్లమెంట్ ను టీఆర్ఎస్ ఎంపీలు స్తంభింపజేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందనేలా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    అయితే టీఆర్ఎస్ ఎంపీలు రాంగ్ ట్రాక్ లో వెళ్లడంతో ఇతర పార్టీల నేతలెవరూ కూడా ఆపార్టీకి మద్దతుగా నిలువడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం వారిని పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం చేసుకున్న ఎంఓయూను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చదివి విన్పించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు సిద్ధమేనని టీఆర్ఎస్ సర్కారే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా తమపై నెపం మోపుతుందనే వివరణ ఇచ్చారు.

    తెలంగాణ ఎంపీలను కేంద్రం తమను పట్టించుకోవడం లేదనే సాకుతో ఆపార్టీ నేతలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆపార్టీకి సెల్ఫ్ గోల్ గా మారింది. ఇదే అదనుగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీల తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. టీఆర్ఎస్ సమావేశాలను బహిష్కరించడం వెనుక తెరవెనుక వేరే కారణంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Also Read: సెక్రెటేరియట్‌లోనూ కేసీఆర్ మార్క్.. వచ్చే ఏడాది కల్లా నిర్మాణం పూర్తి..

    ఓ భూ కుంభకోణంలో నుంచి మంత్రి కేటీఆర్ ను తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఆపార్టీ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, ఒక ఇరిగేషన్ కాంట్రాక్టు సంస్థకు నోటీసులిచ్చిన ఈడీ కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కుదరిన ఒప్పందంతో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ను బహిష్కరించారని రేవంత్ చెప్పారు.

    ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రైతుల పట్ల ఆపార్టీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎంపీలు పార్లమెంట్ ను స్తంభింపజేసి సస్పెండ్ అయ్యేవారని అంటున్నారు. అలా కాకుండా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై నెపంమోపి తప్పించుకోవడంతో విమర్శలు వెల్లువత్తుతున్నాయి . మరీ ఈ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ రైతులకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచిచూడాల్సిందే..!

    Also Read: టీఆర్ఎస్‌కు ఇంత భయమా.. అందుకే క్యాంపు రాజకీయాలు?