https://oktelugu.com/

Actor Prabhas: మరో అరుదైన ఘనత సాధించిన ప్రభాస్… ఆసియా లోనే నెం.1

Actor Prabhas: ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా సాధించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు. ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి గుర్తింపు వచ్చింది. దేశ విదేశాల్లోనూ ప్రభాస్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత ‘సాహో’ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా తీశాడు. తర్వాత నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. 2021 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 12:21 PM IST
    Follow us on

    Actor Prabhas: ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా సాధించిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు. ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి గుర్తింపు వచ్చింది. దేశ విదేశాల్లోనూ ప్రభాస్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత ‘సాహో’ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా తీశాడు. తర్వాత నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. 2021 నాటికి నంబర్ వన్ గ్లోబల్ ఆసియా సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన ప్రపంచం లోని 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలోని తాజా ఎడిషన్‌లో నెంబర్ వన్ గా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ అందరినీ వెనక్కి తోసేసి ప్రభాస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.

    Actor Prabhas

    Also Read: ఆర్ఆర్ఆర్ అలా.. రాధేశ్యామ్ ఇలా.. మధ్యలో భీమ్లానాయక్.. ఎవరికి కలిసివస్తుంది?

    ఈ వార్తా పత్రిక హాలీవుడ్, సంగీత పరిశ్రమ, టెలివిజన్, సాహిత్యం, సోషల్ మీడియాతో సహా ప్రపంచంలోని ప్రముఖుల పాపులారిటీ ఆధారంగా ఈ లిస్ట్ ను రూపొందించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఆ సంస్థ సోషల్ మీడియా పేజెస్ లో దీని గురించి పోస్ట్ చేశారు. ఇప్పటి దాకా ఇండియాలోనే నంబర్ వన్ అనుకునే ప్రభాస్ ఏకంగా ఆసియాలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగారంటే అది మన తెలుగు సినిమాకే గర్వ కారణం అని చెప్పాలి. ప్రభాస్ డౌన్ టు ఎర్త్ స్వభావానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ప్రభాస్ కు ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్‌తో సహా తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు ప్రభాస్. 2021లో అత్యంత పాపులర్ సెలెబ్రిటీస్ టాప్ 50 జాబితా హాలీవుడ్‌లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి నటుడు రిజ్ అహ్మద్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో ప్రియాంక చోప్రా-జోనాస్ ఉన్నారు.

    Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు