https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: హెల్ప్ చేద్దామనుకున్నా.. కానీ నేనే బయటకు వచ్చేసా..షణ్ముక్‌పై రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Bigg Boss 5 Telugu: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఫైవ్ మిగతా సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్కుల విషయంలో విభేదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పద్నాలుగోవారం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ రవి యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌పైన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2021 / 12:36 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఫైవ్ మిగతా సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్కుల విషయంలో విభేదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పద్నాలుగోవారం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ రవి యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్‌పైన తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    Bigg Boss 5 Telugu

    బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పటి విషయాల గురించి తాజాగా యాంకర్ రవి తెలిపాడు. బిగ్ బాస్ హౌజ్‌లో జరుగుతున్న విషయాలను అన్నిటినీ బయటకు ప్రసారం చేయడం లేదని అన్నాడు. ఆడియన్స్‌ను తప్పుదోవ పట్టించే కంటెంట్ మాత్రమే టెలికాస్ట్ అవుతున్నదని, తద్వారా బిగ్ బాస్‌కు వ్యూస్ ప్లస్ ప్రమోషన్స్ అవుతున్నాయని అన్నారు. ఇక సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి ఈ విషయాలపై బోలెడంత డిస్కషన్ జరుగుతున్నదని వివరించారు. అలా హంగామా చేయడానికి బిగ్ బాస్ షో బాగా ఉపయోగపడుతున్నదని అన్నారు.

    ‘బిగ్ బాస్’ షోలో తాను ఎలిమినేట్ అయ్యేంత వరకూ షణ్ముక్ జస్వంత్‌తో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించానని రవి చెప్పాడు. అయితే, షణ్ముక్‌కు ఈ క్రమంలోనే తాను హెల్ప్ చేద్దామనుకున్నానని, కానీ, తానే బయటకు వచ్చేశానని అన్నాడు. రవి ఇతరులను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడని, ఫిట్టింగ్‌లు పెడతాడని, ఒకరిని తొక్కేయడానికి ప్రయత్నిస్తాడని అనేకమైన ట్యాగ్‌లు వేశారని తెలుపుతూ వాపోయాడు. షణ్ముక్, సిరిలు బయటకు ఫ్రెండ్లీగానే అనిపించారని, కానీ, తననే ఎలిమినేషన్ కోసం నామినేట్ చేశారని గుర్తు చేశాడు రవి. అలా తాను బయటకు రావడానికి వాళ్లు కారణమయ్యారన్నారు.

    Also Read: సినిమా క్యారెక్టర్లతో అదరగొట్టిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు…

    తాను ఎలిమినేట్ అయిన తర్వాత సిరి పర్ఫార్మెన్స్ వేరే లెవల్‌లో ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను రవిని మిస్ అవుతున్నానని సిరి తెలిపింది. మిస్ యూ రవి.. అంది కూడా. ఈ క్రమంలోనే తనకు కలలో రవి వచ్చాడని, రవిని చాలా మిస్ అవుతున్నానని అంది. అయితే, నామినేషన్ వచ్చేసరికి మాత్రం రవినే నామినేట్ చేసింది సిరి. ఇక షణ్ముక్‌తో జెల్ అయ్యేందుకు ప్రయత్నించే క్రమంలో అతనికి పలు విషయాలు చెప్పానని అన్నాడు. షణ్ముక్ ఇతరుల మాటలు వింటాడని, కానీ, టైం తీసుకుంటాడని అన్నాడు. ఏదేని విషయం చెప్పినా విని మూడు గంటలు లేదా మూడు రోజులు టైం తీసుకుని షణ్ముక్ అనలైజ్ చేస్తాడన్నాడు.

    Also Read: ఎలిమినేటైన ప్రియాంక మరలా అలా హౌస్ లో ప్రత్యక్షమైంది

    Tags