కేంద్ర మంత్రుల ప్రచారంతో బీజేపీకి లాభమైందా?

గ్రేటర్‌‌ ఎన్నికల అంకం చివరి మజిలీకి చేరింది. రేపటి పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఇక ఫైనల్‌గా లెక్కింపు ప్రక్రియ మిగిలనుంది. నిన్నటితోనే ప్రచారం ముగియగా.. మైకులన్నీ మూగబోయాయి. ఇక మైకులను పక్కన పెట్టిన నేతలంతా ఇప్పుడు చేతులను పని పెట్టారు. పక్షం రోజులుగా గ్రేటర్‌ ప్రచార హోరు సాగింది. రాజకీయ పార్టీల నేతలలతో భాగ్యనగరం జాతరలా తలపించింది. ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు తుటాలుగా పేలాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సమాధులు కూల్చుడు, సర్జికల్ […]

Written By: NARESH, Updated On : November 30, 2020 7:46 pm
Follow us on

గ్రేటర్‌‌ ఎన్నికల అంకం చివరి మజిలీకి చేరింది. రేపటి పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఇక ఫైనల్‌గా లెక్కింపు ప్రక్రియ మిగిలనుంది. నిన్నటితోనే ప్రచారం ముగియగా.. మైకులన్నీ మూగబోయాయి. ఇక మైకులను పక్కన పెట్టిన నేతలంతా ఇప్పుడు చేతులను పని పెట్టారు. పక్షం రోజులుగా గ్రేటర్‌ ప్రచార హోరు సాగింది. రాజకీయ పార్టీల నేతలలతో భాగ్యనగరం జాతరలా తలపించింది. ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు తుటాలుగా పేలాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సమాధులు కూల్చుడు, సర్జికల్ స్ట్రైక్‌లు వంటి భావోద్యేగాల మాటలతో భాగ్యనగరం హీటెక్కింది. ఇవి గ్రేటర్ ఎన్నికల లేక జాతీయ పార్లమెంట్ ఎన్నికల అన్న భావన ప్రజల్లో కలిగింది.

అయితే.. ఎప్పుడూ లేని విధంగా ఈసారి జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు. అమిత్‌ షా, నడ్డా, ఫడ్నావిస్, తేజస్వీ సూర్య, స్మృతి ఇరానీ వంటి నేతలు ప్రచారం చేయడం ఎవరికి, ఏ పార్టీకి ప్రయోజనం జరుగుతుందనే చర్చ మేధావి వర్గంలో జరుగుతోంది. మొదట్లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా సాగిన ప్రచారం చివరి వరకూ వచ్చే సరికి బీజేపీ వర్సెస్‌ ఎంఐఎం మధ్య ఎన్నికలుగా మారింది. దుబ్బాకలో గెలిచి ఊపు మీద ఉన్న కమలం పార్టీ గ్రేటర్‌ పీఠంపై కన్నేసింది. ఎట్టి పరిస్థితిలోనైనా గెలవాలనే పట్టుదలతో ప్రచారం నిర్వహించింది. కానీ ప్రచారం ఎన్నికలు, హైదరాబాద్‌ అభివృద్ధిపై కాకుండా సర్జికల్ స్ట్రైక్‌, రోహింగ్యాలు, పాక్, బంగ్లాదేశ్‌, సమాధుల తొలగింపు వంటి అంశాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి.

దీనిపై బీజేపీ ఎంఐఎంలు విమర్శలు చేసుకున్నాయి. మేయర్‌ పీఠం చేజిక్కుంచుకొనే అవకాశాలు రెండు పార్టీలకు తక్కువే. అయినా.. ఎందుకు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై గ్రేటర్‌ వాసుల్లో గుసగులు వినిపిస్తున్నాయి.రెండు పార్టీల మధ్య లోపాయికార ఒప్పందాలేవో జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో బలపడాలనే ఎంఐఎంకు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందిని అంటున్నారు నగర ప్రజలు. నగరంలో ఓటర్లను మతాలుగా విభజించే ప్రయత్నం ఎంఐఎంకు బీజేపీ నేతల ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. దీంతో సెక్యులర్‌ ఓటర్లతో కేసీఆర్‌కు మరింత మద్దతు పెరుగుతుంది.

అయితే ఇదే అంశాన్ని మేధావి వర్గం మరో రకంగా విశ్లేషిస్తోంది. పాత బస్తీలో బీజేపీ అగ్ర నేతలు, మంత్రులు ప్రచారం చేయడం వల్ల టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందంటున్నారు. బండి సంజయ్‌, అమిత్‌ షా చార్మినర్‌లో భాగ్యలక్ష్మీ టెంపులు చేయడంలో ఎంఐఎం, బీజేపీ పార్టీలు తమ ఓటు శాతాన్ని స్థిరపరుకునే ఉద్దేశం అందులో కనిపిస్తుందంటున్నారు. బీజేపీ హిందువుల ఓట్లు, ఎంఐఎం ముస్లింల ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇది రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు. గ్రేటర్‌లో బీజేపీ నేతలు చేసిన ప్రసంగాలతో టీఆర్ఎస్‌ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై మరింత నమ్మకం కలిగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేటీఆర్‌ సమయస్ఫూర్తిని మరింత దృఢపరస్తుందని.. బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు వేధావి వర్గం. ఎవరి ప్రసంగాలు ఎవరికి ప్లస్‌ అవుతాయో.. చివరికి ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారో రేపటి పోలింగ్‌తో తేలనుంది.