Pawan Kalyan: చంద్రబాబు, లోకేష్ లకు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ బలమైన మద్దతుదారుడు. ఎల్లో మీడియాలో నిత్యం డిబేట్లో పాల్గొంటారు. జగన్ తో పాటు వైసిపి నేతలపై విరుచుకుపడుతుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తుంటారు. అటువంటి శ్రవణ్ కుమార్ సడన్ గా యూ టర్న్ తీసుకున్నారు. తన వైఖరిని మార్చుకున్నారు. ఏకంగా చంద్రబాబు, లోకేష్ లపైనే హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
గత నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి జడ శ్రవణ్ కుమార్ బలమైన మద్దతుదారుడు. టిడిపికి అనుకూలంగా బలమైన వాయిస్ వినిపిస్తుంటారు. రాష్ట్రంలో టిడిపి సీనియర్లు కూడా ప్రభుత్వంపై మాట్లాడేందుకు భయపడుతున్న పరిస్థితుల్లో.. శ్రవణ్ కుమార్ టిడిపి తరఫున వకల్తా పుచ్చుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవారు. అమరావతి తో పాటు ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టేవారు. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ లలో పాల్గొనేవారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శలు ఎక్కుపెట్టేవారు. అయితే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టిడిపిలోకి ఎంట్రీ తర్వాత జడ శ్రవణ్ కుమార్ లోకేష్ చంద్రబాబులను టార్గెట్ చేయడం ప్రారంభించారు. మధ్యలో అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు తో సైతం కయ్యానికి దిగారు. అయితే ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగానే నని తేలుతోంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పై శ్రావణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేయడం విశేషం. ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత పవన్ కు లేదని పేర్కొనడం గమనార్హం. రోజుకో మాటలు మాట్లాడే పవన్.. కనీస అవగాహన లేకుండా మాట్లాడే పవన్.. గజిని సినిమా తరహాలో మెమొరీ లాస్ అంటూ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం సమంజసం కాదని కూడా తేల్చేశారు. అయితే జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యల వెనుక టిడిపి ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. సీఎం సీటు విషయంలో పవన్ పై ఒకలా ముద్ర వేయాలన్న భావనతో.. శ్రవణ్ కుమార్ లాంటి నేతలను టిడిపి ఉసిగొలుపుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మున్ముందు ఈ తరహా ప్రయోగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమ్మో ఇదేమి ర్యాగింగ్ రా బాబు – టీడీపీ జడ శ్రవణ్ కుమార్@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/mM8EBwBjOh
— MBYSJTrends ™ (@MBYSJTrends) December 10, 2023