Pawan Kalyan- Chiranjeevi: మెగా బ్రదర్స్ మధ్య ఉన్నబంధం అందరికీ తెలిసిందే. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆత్మీయ అనుబంధం, సాన్నిహిత్యం చూసి ఎవరైనా మురిసిపోవాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ఆ కుటుంబానికి ప్లాట్ ఫామ్ గా నిలిచారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి దాదాపు అరడజను మందికిపైగా హీరోలు టాలీవుడ్ లో అడుగుపెట్టి రాణిస్తున్నారు. సినీ రంగం వదిలి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. తనకు రాజకీయాలు అచ్చిరావని.. మళ్లీ సినిమా రంగానికి బ్యాక్ అయ్యారు. అయితే కుటుంబానికి ఎదురైన రాజకీయ గుణపాఠంతో జనసేనను స్థాపించి పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ గెలుపు తట్టకపోయినా.. రాజకీయ ప్రయాణాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ చాలా సందర్భాల్లో తప్పుపట్టారు. ప్రజారాజ్యం ఉండి ఉంటే జనసేన అవసరం రాకుండా ఉండేదని చెప్పుకొచ్చారు. అందుకే జనసేన పై చిరంజీవి ముద్ర లేకుండా చూసుకున్నారు. కానీ జనసేనను మెగా అభిమానులు ఆదరించారు. ఫ్యాన్స్ గా మారారు. అయితే జనసేన ఆవిర్భావించిన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో పవన్ ఎన్డీఏకు మద్దతిచ్చారు. ఏపీలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. పవన్ చంద్రబాబుకు మద్దతు తెలపడం చిరంజీవికి ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. పవన్ ఒక ట్రాప్ లో పడుతున్నారని.. వద్దని నాగబాబుతో చెప్పిన వినలేదని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. అయితే 13 సంవత్సరాల కిందట నాటి వీడియో అది. ప్రస్తుతం వైరల్ అవుతోంది.
టీడీపీ, జనసేన మధ్య పొత్తులు కుదరనున్నాయన్న వార్తల నేపథ్యంలో భిన్న ప్రచారానికి కొందరు తెరలేపారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఇష్టం లేని వర్గాలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడవద్దంటూ సూచించే క్రమంలో పాత వీడియోలను, కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా పోస్టులు చేయడం వెనుక రెండు పార్టీల మధ్య పొత్తును చెడగొట్టేందుకేనన్న టాక్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా వింగ్ ఈ పోస్టులు పెడుతుండడంపై అభిమానులు రియాక్టవుతున్నారు. విమర్శలకు దిగుతున్నారు.
వాస్తవానికి చంద్రబాబుతో పవన్ వెళ్లడం మెగా కుటుంబానికి ఇష్టం లేదని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. కానీ జగన్ ను గద్దె దించడానికి మరో మార్గం లేదు. అందుకే పవన్ సైతం ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా చూస్తేనే వైసీపీని ఓడించగలమన్న స్థిర నిర్ణయానికి వచ్చారు. అందుకే అటు బీజేపీని సైతం కలుపుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వారాహి యాత్రలో జనసేనను గెలిపించాలని, తనకు సీఎం చాన్స్ ఇవ్వాలని పవన్ కోరుతున్న నేపథ్యంలో పొత్తుపై నెగిటివ్ ప్రచారం చేసేందుకు చిరంజీవి పాత ఇంటర్వ్యూకు సంబంధించి వీడియో పెట్టారు. అందుకే అబద్ధపు ప్రచారాల విషయంలో జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. అందుకే అభిమానులు లైట్ తీసుకుంటున్నారు.
https://twitter.com/SumaTiyyaguraa/status/1670340883647205377?s=20