Chandrababu: హైటెక్ సిటీలోనూ చంద్రబాబు స్కాం చేశాడా? వెలుగులోకి సంచలన నిజం!

హైదరాబాద్ లో హైటెక్ సిటీ, సైబరాబాద్ ప్రాంతాలు ఒకప్పుడు కొండలతో నిండి ఉండేవి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీని నిర్మించారు.

Written By: Bhaskar, Updated On : September 30, 2023 1:38 pm

Chandrababu

Follow us on

Chandrababu: సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రింట్ మీడియాదే రాజ్యం. ఆ తర్వాత కాలానికి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అది ప్రింట్ మీడియాను చాలా వరకు దెబ్బకొట్టింది. ఇప్పుడు ఈ రెండింటినీ కాదని సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. అంటే ఏది తప్పో, ఏది ఒప్పో, ఏ పత్రిక ప్రచురించే వార్త వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో, ఏ ఛానల్ ప్రసారం చేసే దృశ్యం వెనుక ఎవరి హస్తం ఉందో సోషల్ మీడియా చెప్పేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే తెరవెనుక ఉన్న అసలు విషయాన్ని తెర ముందుకు తెస్తున్నది. ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులను బట్టలిప్పి నడిబజార్లో నిలబెడుతోంది. అయితే ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో, ఎలక్ట్రానిక్ మీడియా గురించి అంతంత మాత్రమే పరిచయం ఉన్న రోజుల్లో తెలుగు నాట ఈనాడు ఏది చెప్తే అదే వేదం. ఆంధ్రజ్యోతి ఏది రాస్తే అదే సత్యం. ఈ ఈ పచ్చ పత్రికల అసలు రూపాన్ని ఇప్పుడు సోషల్ మీడియా బయటపడుతున్నది. అంతేకాదు చంద్రబాబు విషయంలో వారు దాచిన నిజాల్ని బట్టబయలు చేస్తోంది.

హైదరాబాద్ లో హైటెక్ సిటీ, సైబరాబాద్ ప్రాంతాలు ఒకప్పుడు కొండలతో నిండి ఉండేవి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైటెక్ సిటీని నిర్మించారు.. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద ఐటీ కంపెనీని హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చారు. అనంతరం పెట్టుబడులు వెల్లువలాగా వచ్చాయి. సెజ్ లు ఏర్పాటయ్యాయి. ఆర్థిక పరంగా వృద్ధి నమోదయింది. హైదరాబాద్ కనివిని ఎరుగని స్థాయిలో విస్తరించింది. ఇప్పుడు నయా హైదరాబాద్ విదేశాలతో పోటీపడుతోంది. అయితే ఇది ఒక కోణం మాత్రమేనా? హైటెక్ సిటీ నిర్మాణం వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయా? అంటే దీనికి అవును అనే సమాధానం చెబుతున్నారు కొంతమంది నెటిజన్లు.

ఏపీలో స్కిల్ పథకానికి సంబంధించి అవక తవకల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సిఐడి అధికారులు అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు విచారణ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో స్కిల్ పథకంలో అసలు ఎటువంటి అవినీతి జరగలేదని టిడిపికి చెందిన సోషల్ మీడియా వాదిస్తోంది. మరో వైపు వైసీపీకి చెందిన సోషల్ మీడియా ఒక అడుగు ముందుకు వేసింది. స్కిల్ పథకం మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన హైటెక్ సిటీ నిర్మాణంలోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో భూములను అత్యంత చవక ధరకు తనకు అనుకూలమైన వ్యక్తులకు చంద్రబాబు కట్టబెట్టారని, హైటెక్ సిటీ నిర్మాణంలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించలేదని ఆరోపిస్తోంది. ఇదే వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కోర్టులకు వెళ్లారని, తనకు ఉన్న బలంతో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్కిల్ పథకంలో చంద్రబాబు నాయుడు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో.. వైసీపీ సోషల్ మీడియా విభాగం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.