AP Politics : ఆంధ్రాలో రాజకీయాంశాల కన్నా సామాజికాంశాలే ప్రభావితం చేస్తున్నాయా?

ఈ మతం ప్రాతిపదికన పడుతున్న ఓట్లకు అతీతంగా ఈ కుండమార్పిడి అధికారం మార్చి బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలని జనసేన స్థాపించారు.

Written By: NARESH, Updated On : September 30, 2023 2:50 pm

AP Politics : మొదటి నుంచి ఆంధ్రాలో రాజకీయాలను సామాజిక అంశాలు శాసిస్తున్నాయి. అందుకే అధికారం ఎప్పుడూ రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్యనే ఉంటోంది. ఆంధ్రాలో కులంతోపాటు మతం కూడా ముఖ్యమైన అంశంగా మారింది. జాతీయ మీడియాకు, సెఫాలజిస్టులకు దీని గురించి తెలిసింది చాలా తక్కువ. జనాభా గణాంకాల్లో ఎక్కడా ఏపీలో 20 శాతం క్రిస్టియానిటీ ఉందన్న విషయం వారికి తెలియదు. గణాంకాలు వేరుగా ఉన్నాయి.. నిజం గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది.

2014లో ఆంధ్రా ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ బైబిల్ చేత పట్టుకొని మొత్తం ప్రచారం చేసింది. ఇవాళ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అధికారం అంటే రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకే పరిమితమైంది. వాళ్ల సొంత సామాజికవర్గాలతోపాటుగా జగన్ కు ఎస్సీ, క్రిస్టియన్ల ఓట్లు భారీగా పడుతున్నాయి.

ఈ మతం ప్రాతిపదికన పడుతున్న ఓట్లకు అతీతంగా ఈ కుండమార్పిడి అధికారం మార్చి బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలని జనసేన స్థాపించారు.

ఆంధ్రాలో రాజకీయాంశాల కన్నా సామాజికాంశాలే ప్రభావితం చేస్తున్నాయా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.