ABN Radha Krishna : పవన్ కళ్యాణ్ పై విమర్శల్లో జర్నలిజం ప్రమాణాలు పాటించారా?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈవారం కొత్త పలుకు విమర్శలపాలైంది. గతవారం తన కొత్త పలుకులో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడని, మధ్యవర్తులుగా ఆంధ్రప్రదేశ్ కాపు నేతల్ని రంగంలోకి దింపాడని బొంబాట్ గా రాసుకొచ్చాడు. అంతేకాదు పవన్ కేసీఆర్ ఫోల్డ్ లోకి వెళ్ళిపోతున్నాడని, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులు ఇక ఆలోచించుకోవాలని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు.. ఇది సహజంగానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. “తన వెయ్యి కోట్ల వ్యాసం” […]

Written By: NARESH, Updated On : February 28, 2023 10:05 pm
Follow us on

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈవారం కొత్త పలుకు విమర్శలపాలైంది. గతవారం తన కొత్త పలుకులో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడని, మధ్యవర్తులుగా ఆంధ్రప్రదేశ్ కాపు నేతల్ని రంగంలోకి దింపాడని బొంబాట్ గా రాసుకొచ్చాడు. అంతేకాదు పవన్ కేసీఆర్ ఫోల్డ్ లోకి వెళ్ళిపోతున్నాడని, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులు ఇక ఆలోచించుకోవాలని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు.. ఇది సహజంగానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. “తన వెయ్యి కోట్ల వ్యాసం” తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఇది లాభం కలిగిస్తుందని రాధాకృష్ణ అనుకున్నారు. కానీ ఆర్కే ఒకటి తలిస్తే, ఏపీ జనం మరొకటి తలచారు. సీన్ బెడిసి కొడుతున్న నేపథ్యంలో బాబు ఆర్కే కు బాగా తలంటాడు. అందులో భాగమే ఇవాళ్టి ప్రాయశ్చిత్త పలుకు.

ఎప్పుడయితే కేసీఆర్ పవన్ కి వెయ్యి కోట్లు ఆఫర్ ప్రకటించాడు అని రాశాడో అప్పుడే వైసీపీ అలర్ట్ అయింది..రోగి కోరింది పెరుగు అన్నమే, డాక్టర్ తినమని చెప్పిందీ పెరుగన్నమే అన్నట్టుగా వై సీపీ కోరుకున్నట్టుగానే ఆర్కే తన పత్రికలో పవన్ కు వ్యతిరేకంగా రాయడంతో వైఎస్ఆర్సిపి జబ్బలు చరుచుకుంది. ఆ కథనాన్ని తన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించింది. దీంతో దెబ్బకు జనసేన నాయకులు అలర్ట్ అయ్యారు..ఆర్కే మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అంతే కాదు ఏపీ లో ఆ పత్రికను తగలబెట్టారు.. ఈ విషయం బాబుకు తెలియడంతో ఆర్కే మీద పైర్ అయ్యారు. ” నీకు నీ వార్తలకు ఓ దండం. ముందు ఆ రోత రాతలు మానుకోవయ్యా” అంటూ హెచ్చరికలు పంపారు. ఇక పవన్ నుంచి ఘాటు మాటలు రావడంతో ఆర్కే కు ఏం చేయాలో పాలు పోలేదు.. ఫలితంగా క్షమించండి అని వేడుకున్నాడు.

పవన్ కళ్యాణ్ పై విమర్శల్లో ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిజం ప్రమాణాలు పాటించారా? ఆయన రాతలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..