Diamond mining: ఆదివాసీల గుండెల్లో ‘వజ్రాల’ చిచ్చు..

Diamond mining: భూమికి పచ్చదనం రంగేసినట్లు దట్టమైన అడవి.. అడవిలో నివసించే ఆదివాసీలంతా అడవితల్లిపైనే ఆధారపడి జీవిస్తారు. ఆహారం, నీరు, వైద్యం, ఉపాధి అన్నీ వృక్షామతల్లే ప్రసాదిస్తుందని ఇక్కడి వారు నమ్ముతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారి మానాన వారు హాయిగా జీవిస్తున్నారు. సాంప్రదాయాలను కాపాడుకుంటూ తమ వారసులను తమ సంపదను అందిస్తూ జీవిస్తున్నారు. కానీ వీరి జీవితాల్లోకి ఒక్కసారిగా ‘మైనింగ్ భూతం’ ఎంట్రీ ఇచ్చింది. ఇక అంతే.. వారి జీవితాలు కకాలవికలమవుతున్నాయి. భవిష్యత్ దేవుడెరుగు.. […]

Written By: NARESH, Updated On : October 23, 2021 9:54 am
Follow us on

Diamond mining: భూమికి పచ్చదనం రంగేసినట్లు దట్టమైన అడవి.. అడవిలో నివసించే ఆదివాసీలంతా అడవితల్లిపైనే ఆధారపడి జీవిస్తారు. ఆహారం, నీరు, వైద్యం, ఉపాధి అన్నీ వృక్షామతల్లే ప్రసాదిస్తుందని ఇక్కడి వారు నమ్ముతారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారి మానాన వారు హాయిగా జీవిస్తున్నారు. సాంప్రదాయాలను కాపాడుకుంటూ తమ వారసులను తమ సంపదను అందిస్తూ జీవిస్తున్నారు. కానీ వీరి జీవితాల్లోకి ఒక్కసారిగా ‘మైనింగ్ భూతం’ ఎంట్రీ ఇచ్చింది. ఇక అంతే.. వారి జీవితాలు కకాలవికలమవుతున్నాయి. భవిష్యత్ దేవుడెరుగు.. ఇప్పుడు బతికుంటే అదే గొప్ప అంటున్నారు. ఇంతకీ ప్రశాతంగా జీవనం గడుపుతున్న మైనింగ్ భూతం వీరి జీవితాల్లోకి ఎలా వచ్చింది..? ఎక్కడి ఆదివాసీలు ఇలా బాధపడుతున్నారు..?

dimond mining in mp

భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలోని ఛత్రపూర్ జిల్లలో ‘‘బక్స్ వాహా’’ దట్టమైన అటవీ ప్రాంతం. అస్ట్రేలియాలో అతిపెద్ద పేరును కలిగి ఉన్న రియో-టింటోకు బక్స్ వాహ ప్రాంతంలో వజ్రాలను కనుగొనే ప్రాజెక్టు లభించింది. ఏళ్ల తరబడి పరిశోధించిన తరువాత ఇక్కడ రూ.55,000 కోట్ల విలువైన వజ్రాలు లభించే అవకాశం ఉందని గుర్తించారు. అయితే శతాబ్దాలుగా ఇక్కడ జీవిస్తున్న ఆదివాసీలు ఇక్కడ మైనింగ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు పర్యావరణ సమస్యల కారణంగా 2016లో రియో-టింటో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

అయితే కోట్ల పెట్టుబడి పెట్టిన రియో-టింటో కంపెనీ ఎందుకు ఇక్కడి నుంచి విరమించుకుంది..? అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తాయి. కానీ నిజం నిప్పులాంటిది. ఎన్నటికైనా బయటకు వచ్చేస్తుంది. అసలు విషయం ఏంటంటే ఆ ప్రాజెక్టును 2019లో కొత్త వేలం పాటలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఎస్సెల్ మైనింగ్ కంపెనీ ఇక్కడ వజ్రాలను తవ్వేందుకు లైసెన్స్ తీసుకుంది. ఇందులో భాగంగా 382 కోట్ల హెక్టార్ల భూమిలో మైనింగ్ తవ్వకాలు జరపాలని నిర్ణయించింది.

అడవితల్లీపై ఆధారపడుతున్న తమకు మైనింగ్ తో చాలా ఇబ్బదులు ఏర్పడుతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రియో-టింటో ప్రాజెక్టు వల్ల కొంత మందికి ఉపాధి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. 2004 లో ప్రభుత్వం గానీ, ఆ సంస్థ గానీ మా పిల్లలకు మైనింగ్ పై అవగాహన కల్పిస్తే బాగుండునని, ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు కల్పించిన తరువాత మైనింగ్ ప్రాజెక్టు చేపడితే తమకేమీ నష్టం లేదని స్థానికులు వాపోతున్నారు. కొందరు చదువుకున్న వారికి ప్రాజెక్టులో ఉపాధి కల్పించాలని వారు అంటున్నారు. కానీ రియో-టింటో కంపెనీతో దొరికిన ఉపాధి తాజాగా ఆదిత్యా బిర్లా గ్రూపులో దొరకడం లేదని వారంటున్నారు.

మరోవైపు మైనింగ్ ఏర్పాటు వల్ల చాలా భూభాగం తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. దీంతో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. దీని వల్ల చాలా మంది చెట్లను నమ్ముకున్నవారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్ప, ఉసిరి, బీడీ ఆకులు అమ్మి కొందరు జీవనం గడుపుతున్నారు. ఒక సాధారణ కుటుంబానికి ఇలాంటి వాటి వల్ల సంవత్సరానికి 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. కానీ వజ్రాల తవ్వకం మొదలు పెడుతారనడంతో తాము ఎలా బతికేది ఆని షహపురా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు అడవిని నమ్ముకున్న మేము పెద్దగా అభివృద్ధి చెందకపోవచ్చు.. కానీ ప్రాజెక్టుల ద్వారా మాకు ఉపాధి కల్పిస్తే అందరం భాగుంటాం. కానీప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడం గ్రామస్థులు అంటున్నారు.

బక్స్ వాహ అడవుల్లో ఆదివాసీల వ్యతిరేకతే కాకుండా ఇక్కడున్న గుహాల్లో 25000 సంవత్సరాల పురాతనమైన భారతీయ శిల్పాలు దాగున్నాయి.. వేల సంవత్సరాల నాటి మానవ చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. అయితే వజ్రాల మైనింగ్ ఏర్పడితే ఇవన్నీకనుమరుగు కాక తప్పదు.