
జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి, దహెగాం మండలం దిగడలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి బరోసానిచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.