https://oktelugu.com/

దేవినేని ఉమకు బిగ్ రిలీఫ్.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీలో మైనింగ్ వ్యాపారం విషయంలో దుమారం రేగుతోంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారంపై పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ జరిగిన ఘనటపై ఉమను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన హైకోర్టులో బెయిలో కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు బెయిల్ మంజూరు అయింది. మైనింగ్ పై పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమపై […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 4, 2021 3:43 pm
    Follow us on

    Devineni Umaఏపీలో మైనింగ్ వ్యాపారం విషయంలో దుమారం రేగుతోంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారంపై పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ జరిగిన ఘనటపై ఉమను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన హైకోర్టులో బెయిలో కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు బెయిల్ మంజూరు అయింది.

    మైనింగ్ పై పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద జి. కొండూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే దేవినేని ఉమ తనపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఉమ బెయిల్ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం ఉమకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే ఉమపై అక్రమ కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

    గత నెల 28న కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని దేవినేని ఉమతో పాటు పలువురు టీడీపీ నేతలు మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు దేవినేని ఉమ వర్గాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్తలు ఉమ కారుపై రాళ్లు రువ్వారు. దీంతో ఉమపై పోలీసులు అరెస్టు చేశారు.

    ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. జైలులో ఆయనకు రక్షణ లేదని కుటుంబసభ్యులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఉమకు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ మైనింగ్ టీడీపీ హయాంలోనే జరిగిందని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆరోపించారు.