https://oktelugu.com/

ఆ భూములు కొంటే శిక్షార్హులే..!

రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం పేరుతో మరో కొత్త కుంభకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేసే కార్యక్రమాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో ఆ భూములు కొన్నా, ఎన్ని జీవోలు ఇచ్చినా తెదేపా అధికారంలోకి రాగానే ఆ భూములన్నీ ప్రభుత్వానికే దక్కేలా చేస్తామన్నారు. భూముల వేలంకు బాధ్యులైన అధికార్లు, సహకరించిన వాళ్ళు, కొన్నవాళ్లు అందరూ […]

Written By: , Updated On : May 14, 2020 / 08:14 PM IST
Follow us on

రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం పేరుతో మరో కొత్త కుంభకోణానికి తెరతీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను వేలం వేసే కార్యక్రమాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో ఆ భూములు కొన్నా, ఎన్ని జీవోలు ఇచ్చినా తెదేపా అధికారంలోకి రాగానే ఆ భూములన్నీ ప్రభుత్వానికే దక్కేలా చేస్తామన్నారు.

భూముల వేలంకు బాధ్యులైన అధికార్లు, సహకరించిన వాళ్ళు, కొన్నవాళ్లు అందరూ
శిక్షార్హులవుతారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూదోపిడీలో భాగస్వాములవ వద్దని హెచ్చరించారు. తెదేపా అధికారంలోకి రాగానే భూ వేలంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని భూములను ప్రభుత్వం స్వాధీన పరుచుకుంటుంది. రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమాన్ని ఆపాలన్నారు.

తెదేపా అనుమతులిచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం తిరిగి అనుమతులిచ్చి గొప్పలు పోతోందని చెప్పారు. తెదేపా హయాంలో 25 ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతా ఉంటే ఆపేశారని, కోస్తాంధ్ర పట్టిసీమ, పురుషోత్తమపట్నం పోలవరం ప్రాజెక్టులో 70శాతం, వెలుగొండ, సంఘం నెల్లూరు ప్రాజెక్టులు , హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి చరిత్ర సృష్టించామన్నారు.

రెడ్ జోన్ , గ్రీన్ జోన్ ఆరేంజ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్ మిషన్ మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ఖజానాలో రూ.13వేల కోట్ల డబ్బుఉందని, రూ.20 వేల కోట్లు జీఎస్టీ కింద, కరోనా కట్టడికి కేంద్రం రూ.20 వేల కోట్లు అందించింని చెప్పారు. మరి ఇవాళ రూ.200 కోట్ల డబ్బుకోసం 9 స్థాలాలు విశాఖ, గుంటూరులో స్థలాల అమ్మకం ఎందుకని ప్రశ్నించారు.