బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగానా రనౌత్ గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఆమెకు కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. కంగనా వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సైతం కంగనాకు శత్రుత్వం ఏర్పడుతుండటం గమనార్హం. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఆయన అదిరిపోయే పంచులు వేసి మహారాష్ట్ర సర్కార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. సుతిమెత్తగా చురకలు అంటించి మహారాష్ట్ర సర్కార్ ను ఇరుకున పెట్టారు. పైకి నవ్వుతూనే మహారాష్ట్ర సర్కార్ కు ఆయన సీరియస్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మహారాష్ట్ర సర్కార్ కంగనాతో పోరాడుతోందని… ప్రభుత్వం కంగనాతో కంటే కరోనాతో పోరాడితే బాగుంటుందని సూచనలు చేశారు.
కంగనాపై యుద్ధం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని…. కరోనాతో యుద్ధం చేస్తే ప్రజల ప్రాణాలనైనా కాపాడవచ్చని హితవు పలికారు. ప్రభుత్వం కంగనాపై పోరాటం కోసం చేసే ఖర్చులో సగం కరోనా కోసం చేసినా మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. మహారాష్ట్ర సర్కార్ ముంబైలోని కంగనా కార్యాలయాన్ని కూల్చడంపై దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు.
దావూద్ ఇంటిని కూల్చని మహారాష్ట్ర సర్కార్ కంగనా ఇంటిని ఎందుకు కూల్చిందో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం మహారాష్ట్ర సర్కార్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. కంగనా విషయంలో మహారాష్ట్ర సర్కార్ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.