టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయనకు సినిమా నిర్మాణం పట్ల ఎంత అభిరుచి వుందో ఇండస్ట్రీలోని ప్రతీఒక్కరికి తెల్సిందే. ఇక సినిమా జయాపజయాలపై కూడా అంతే జడ్జిమెంట్ నూటికి నూరుపాళ్లు నిజమవుతుందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకు తగ్గటుగానే సినిమాల విషయంలో ఆయన నిర్ణయాలు ఉంటాయి.
Also Read: గుండు వెనుక అసలు కారణం ఇదా….?
దిల్ రాజు నిర్మాణంలో హీరో నాని 25వ సినిమా తెరకెక్కింది. దర్శకుడు ఇంద్రగంటితో నానికి ఇది మూడోచిత్రం కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. నానితోపాటు సుధీర్ బాబు, హీరోయిన్లుగా నివేథా దామస్, అదితిరావులు నటించారు. ఈ మూవీని ఉగాదికి తీసుకురావాలని చిత్రబృందం ఏర్పాట్లు చేసుకుంది.
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజై అయింది. చిత్రయూనిట్ ‘వి’ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించినా నిర్మాత దిల్ రాజు వారికి నచ్చచెప్పడంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అందరూ సమ్మతించారు. దీంతో అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు ఈ మూవీని కోనుగోలు చేసింది. ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాగా ‘వి’ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. అయితే ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో ఈ సినిమా రిలీజైతే ఖచ్చితంగా నిర్మాత నష్టపోయేవాడనే టాక్ విన్పిస్తోంది.
కాగా ‘వి’ చిత్రం థియేటర్లలో రిలీజు కాకుండానే అదిరిపోయే బిజినెస్ చేయడంతో దిల్ రాజు ఖుషీ అవుతున్నారు. అమేజాన్ ప్రైమ్ ఏకంగా 31.44కోట్లకు ‘వి’ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ ను జెమిని సంస్థ 8కోట్లకు దక్కంచుకోగా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 7కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం రెవిన్యూ 46కోట్లు కాగా ఈ సినిమాకు అయిన మొత్తం ఖర్చు 33కోట్లు. దీంతో ఈ సినిమాకు వచ్చిన లాభం 13కోట్లు. వడ్డీలకు రూ.3కోట్లు పోగా ఫైనల్ గా ‘వి’ ద్వారా దిల్ రాజుకు రూ.10కోట్ల లాభం వచ్చిందట.
Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..? వెల్లడించిన రియా?