Also Read : డ్రగ్స్ కేసులో రకుల్ పేరు..? వెల్లడించిన రియా?
కడపల్లి వద్ద జరిగిన దుర్ఘటనలో మరణించిన, గాయపడిన జనసైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయలసీమ ప్రాంత సంయుక్త సమన్వయ కమిటీ సభ్యుడు చింతా సురేష్, తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్, కుప్పం ఇన్‌చార్జి డాక్టర్ ఎమ్.వెంకటరమణ, గంగాధర నెల్లూరు ఇన్‌చార్జి డాక్టర్ యుగంధర్ వెళ్లారు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశాడు.
ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన అల్లు అర్జున్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు అందించారు. అలాగే జనసేన ఎన్నారై మద్దతుదారులు రూ.5.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. అలాగే.. నిర్మాత దిల్ రాజుకు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు. మరో నిర్మాత ఏఎం రత్నంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 6 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చి గొప్ప హృదయాన్ని చాటుకొన్నారు. ఇలాంటి విషాద సమయంలో మీరు చూపించిన మానవత్వం గురించి మాటల్లో చెప్పలేం అంటూ పవన్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలాగే.. ఆ ఫ్యామిలీలకు మైత్రీ మూవీస్ కూడా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. మైత్రీ మూవీస్ అధినేతలు రవి, నవీన్‌కు కూడా పవన్ ధన్యవాదాలు చెప్పారు. మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చూపిన బాధిత కుటుంబాలకు అందించిన సహకారం గొప్పది అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read :