ఒంటెను ఎడారి ఓడ అంటారు. దానికుండే ప్రత్యేకత అది. ఎడారుల్లో నీరు తాగకుండా కొన్ని రోజుల పాటు జీవించే ఒంటెతో చాలా ప్రయోజనాలున్నాయి. ఆహారం లేకుండా కూడా ఐదారు నెలల వరకు జీవించగలగడం దానికున్న గొప్ప వరంగా చెబుతారు. అందుకే దీన్ని డెజర్ట్స్ షిప్స్ అని పిలుస్తుంటారు. ఒంటె వీపుపై ఉండే మూపురంలో కొవ్వు నిలువ ఉంటుందని తెలిసిందే. అందులో ఉండే కొవ్వుతో ఒంటె అలసట లేకుండా ఎక్కువ దూరం వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

ఒంటె ఒకే సారి సుమారు వంద లీటర్ల నీరు తాగుతుంది. అలాగే దాన్ని ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోగలదు. ఎడారుల్లో నీరు తాగకున్నా రెండు మూడు వారాల పాటు ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీంతో దాని శరీరం చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకునే వెసులుబాటు కలిగి ఉంటుంది. ముక్కులో ఉండే వెంట్రుకలతో గాలిలో తేమను గ్రహిస్తూ ముందుకు వెళ్తుంది. ఒంటెల రక్తంలో ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండటం వల్ల నీరు ఎంత తాగినా నీరు విచ్చిన్నమయ్యే అవకాశం లేదు.
ఒంటె శరీరాకారం వింతగా ఉంటుంది. దాని మూపురంలో కొవ్వు ఉంటుంది. దీంతో అది ఎడారుల్లో ఎంత తిరిగినా అలసట లేకుండా వెళ్లగలదు. ఇసుక కళ్లల్లో పడకుండా కూడా దాని శరీర నిర్మాణం ఉంటుందని తెలుస్తోంది. దీంతో అది ఎంత దూరమైనా సునాయాసంగా ప్రయాణిస్తుంది. ముళ్ల చెట్లు, కాయలు తిన్నా దానికి ఎలాంటి గాయాలు కావు. దుమ్ము వచ్చినప్పుడు కూడా ముక్కు రంధ్రాలు మూసుకునే ఒంటె దాని నుంచి కూడా రక్షణ పొందుతుంది.
Also Read: Bride market: పెళ్లికూతుళ్లు అమ్మబడును.. ఆశావహులు త్వరపడండి
41 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితేనే ఒంటెకు చెమట పడుతుందట. ఒంటె కాళ్లలో ఉండే బలమే దానికి శ్రీరామరక్ష. ఒంటెలు శత్రువులు దాడి చేసే సమయంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండే చక్కని ద్రవాన్ని ఉమ్ముతాయి. దీంతో దాని వాసన భరించడం కష్టంగా ఉండటంతో శత్రు జంతువులు పలాయనం చిత్తగిస్తాయని తెలుస్తోంది. ఒంటెలో ఉండే ప్రత్యేకతల వల్ల దానికి ప్రమాదాలేవి రావని సమాచారం.
Also Read: Currency on Road: రోడ్లపై నోట్ల కట్టలు.. ఎగబడ్డ జనం.. కానీ ఏమైందో తెలిస్తే షాకింగే..