Shilpa Shetty: గత నాలుగు నెలల కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు శిల్పా శెట్టి దంపతులు. పోర్నోగ్రఫీ ఆరోపణలపై శిల్పా భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నీలి చిత్రాల చిత్రీకరణ, యాప్ ల ద్వారా ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలు రాజ్ కుంద్రా ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయన రెండు నెలలు జైలులో ఉన్నారు.

భర్త అరెస్ట్ తో శిల్పా అజ్ఞాతంలోకి వెళ్లారు. కొన్ని టీవీ కార్యక్రమాలకు ఆమె జడ్జిగా ఉండగా, వాటిలో పాల్గొనలేదు. మెల్లగా సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు. ఈ కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని బయటపడతాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీడియా శిల్పా శెట్టి కుటుంబాన్ని మీడియా టార్గెట్ చేసింది. అయితే కొందరు బాలీవుడ్ సెలెబ్స్ ఆమెకు మద్దతుగా నిలిచారు.
సెప్టెంబర్ లో బెయిల్ పై రాజ్ కుంద్రా విడుదలయ్యారు. అనంతరం శిల్పా దంపతులపై ఓ వ్యాపార వేత్త చీటింగ్ కేసు పెట్టారు. ఫిట్నెస్ సంస్థ ఏర్పాటు చేద్దామని బిజినెస్ ఒప్పందం చేసుకొని తన వద్ద కోటిన్న రూపాయలు వసూలు చేశారని, చెప్పినట్లు సంస్థ స్థాపించకపోగా, డబ్బులు తిరిగి చెల్లించడం లేదని కేసు ఫైల్ చేశారు.
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల అనంతరం శిల్పా దంపతులు ఓ శుభదినం జరుపుకుంటున్నారు. నేడు శిల్పా, రాజ్ కుంద్రాల పెళ్లి రోజు. 12 ఏళ్ల దాంపత్య జీవితాన్ని ఈ జంట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా భర్తకు శిల్పా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కూడా శిల్పాకు బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది.
Also Read: Sai Pallavi: హీరోయిన్గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ.. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది
కాగా ఒకప్పుడు ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓనర్స్ గా ఉన్న శిల్పా దంపతులు, ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం ఐపీఎల్ ఫ్రాంచైజీ నుండి శిల్పా, రాజ్ కుంద్రాలను బహిష్కరించడం జరిగింది. తరచుగా నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా ఫ్యామిలీ పై సమాజంలో నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోని శిల్పా… తన కెరీర్ కొనసాగిస్తున్నారు.
Also Read: Rajamouli: పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ.. ఆ విషయంపైనే చర్చించనున్నారా?