Allu Arjun Body Guard: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనసు కూడా వెన్ననే అని మరోసారి అర్థమైంది. తన కోసం పనిచేసే వారి విషయంలో బన్నీ చూపించే ప్రేమ అంతా ఇంతా కాదట.. తన బాడీ గార్డు విషయంలో బన్నీ ఎంత చొరవ తీసుకున్నాడో? ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలిస్తే నిజంగా బన్నీని గ్రేట్ అనక మానరు..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ‘అల వైకుంఠపురం’ సినిమా గ్రాండ్ హిట్ తో తన కెరీర్ లోనే అతిపెద్ద సినిమాగా నిలిచిపోయింది. సినిమా సక్సెస్‌ని బన్నీ తెగ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం సుకుమార్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ‘పుష్ప’ చేస్తున్నాడు. ఇందులో అతను లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా నెగెటివ్ పాత్ర చేస్తున్నాడు. ఇది బన్నీకి 20వ సినిమా. వీరి కాంబోలో ఇది మూడో సినిమా కావడం గమనార్హం.
అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు.. తన తోటి వారితో మర్యాదగా.. స్నేహంగా ఉంటాడు. ముఖ్యంగా ఆయన తన పర్సనల్ స్టాఫ్ ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. పీఆర్ టీం కానీ.. వ్యక్తిగతంగా ఉండే స్టాఫ్ ను కానీ బన్నీ చాలా బాగా చూసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తాజాగా అది మరోసారి నిరూపించాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురంలో సినిమా క్లైమాక్స్ లో ‘పులి వచ్చింది.. మేక చచ్చింది’ అన్న డైలాగ్ ను పలికే విలన్ మరెవరో కాదు.. అల్లు అర్జున్ బాడీగార్డ్ నే. అతడి పేరు రమేశ్. తన బాడీగార్డ్ రమేష్ పుట్టినరోజు వేడుకను బన్నీ ఘనంగా జరిపాడు.ఈ బర్త్ డే ఈవెంట్ లో తన బాడీగార్డ్ కి బన్నీ ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.