Demographic Crisis In China: చైనాలో ఏం జరిగినా, చైనా ఏం చేసినా ఆ ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది. తన దురదను ప్రపంచానికి అంటిస్తుంది. తన దుగ్దను ఎదుటి దేశాల మీద తీర్చుకుంటుంది. మొన్నటిదాకా కరోనాతో సతమతమైన ఆ దేశం ఇప్పుడు కొత్త సమస్యతో తల్లడిల్లుతోంది. ప్రపంచ జనాభాలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ దేశం.. విపరీతంగా పెరుగుతున్న జనాల సంఖ్యను కట్టడి చేసేందుకు అప్పట్లో కఠిన చర్యలకు దిగింది. చైనా తీరు తెలుసు కదా! అది పేరుకే కమ్యూనిస్టు. చేసేవన్నీ ఫాసిస్టు బుద్ధులే. ప్రపంచాన్ని శాసించేందుకు యుహాన్లో కరోనాను ఎగదోసినా దానికే చెల్లు. ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నా, యావత్ మానవ జాతి మొత్తం కాండ్రించి ఉమ్మినా జానేదాన్ అనే తీరు దానికే సొంతం. డ్రాగన్ స్థానంలో మరో దేశం ఉన్నా ఈ పాటికి అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొనేది.

జననాల సంక్షోభం
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అంటారు. ఆ మందినే పల్చగా చేసేందుకు చేపట్టని కార్యక్రమాలు అంటూ లేవు. బలవంతంగా కుటుంబ ఆపరేషన్లు చేసింది. ఒక్కరే హద్దు.. లేకుంటే వద్దు అని నినాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళింది. ఏకంగా యూహాన్ నగరానికే తాళం వేసిన చైనీయులకు అదొక లెక్కా. ఎప్పుడైతే చైనా జనాభా నియంత్రణకు నడుం బిగించిందో అప్పుడే సమస్య ప్రారంభమైంది. జనాల సంఖ్య పై ప్రభుత్వం కఠిన నియంత్రణ విధించడంతో చాలామంది యువకులు వివాహాలకు దూరంగా ఉన్నారు. ఒకవేళ చేసుకున్నా.. బలవంతంగా కుటుంబ నియంత్రణ పాటించారు. దీనివల్ల జనాభా సంఖ్య తగ్గింది. ఫలితంగా యువతరం సంఖ్య తగ్గిపోయింది. అదే సమయంలో మధ్య వయస్కులు, వృద్ధుల సంఖ్య పెరిగింది. పారిశ్రామిక విధానాల్లో, వస్తువుల ఉత్పత్తిలో చైనాను మించే దేశం లేదు.కానీ ప్రస్తుతం పనిచేసే వారు తక్కువైపోయి ఉత్పత్తులు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆ ఆర్డర్లు యూరోపియన్ దేశాలు,ఇండియా దక్కించుకుంటున్నాయి.
Also Read: Chandrababu- KCR Ring: చంద్రబాబు, కేసీఆర్ ఉంగరం ఒక్కటేనా..? తేడాలేంటి..?

చైనీయుల సగటు ఆయుర్దాయం పెరుగుతోంది
జననాల రేటు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా లో ప్రజల సగటు జీవిత కాలం మాత్రం పెరుగుతోంది. ప్రస్తుతం చైనీయుల జీవితకాలం 0.6 ఏళ్లు పెరిగి 77.93 ఏళ్లకు చేరుకున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చైనా జాతీయ కమిషన్ నివేదిక ప్రకారం 2020 నాటికి ఆ దేశంలో 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ జనాభా 26.4 కోట్లు. ఇది ఆ దేశ జనాభాలో 18.7%. ఇక చైనాలో ఆరోగ్య అక్షరాహత రేటు కూడా పెరుగుతున్నది. ప్రస్తుతం ఆ రేటు 24.5% పెరగడంతో పాటు శాఖ వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారి సంఖ్య 37.2 శాతానికి పెరిగిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రణాళిక విభాగం సంచాలకుడు మావో క్వున్ ఆన్ చెబుతున్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఫిట్నెస్ కేంద్రాల కోసం ఏటా ఒక బిలియన్ యువాన్లు (149 అమెరికన్ డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు ఆయన వివరించారు. మరోవైపు ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే టిబెట్లోను సగటు మనిషి జీవితకాలం పెరిగింది.
కలవరపెడుతున్న వృద్ధాప్యం
ఇది ఇలా ఉంటే చైనాలో కొన్నేళ్లుగా జనాల రేటు దారుణంగా పడిపోయింది. ఇదే సమయంలో వృద్దుల సంఖ్య భారీగా పెరిగింది. ఇది గ్రహించిన ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పాటించిన ఒకరు ముద్దు అన్న నినాదాన్ని పక్కన పెట్టింది. ఇద్దరు పిల్లలను కనవచ్చని 2016లో ప్రకటించింది అంతేకాకుండా కుటుంబ నియంత్రణ చట్టాన్ని ఇటీవల మరోసారి సవరించి మూడో బిడ్డని కూడా కనేందుకు వీలు కల్పించింది. అలాంటి దంపతులకు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ చైనా జనాభాలు మాత్రం వృద్ధి కనిపించడం లేదు. జీవన వ్యయం పెరగడం, పట్టణీకరణ వల్ల పెద్ద కుటుంబాలు తగ్గిపోవడం, పిల్లలను పెంచడం కష్టం కావడం, శ్రీలు పెళ్లిలను వాయిదా వేసుకోవడం వంటి కారణాలు జన బతకేందుకు కారణాలుగా అక్కడి శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. జనాభా ఇలానే తగ్గితే మున్ముందు రోజుల్లో ప్రపంచానికి అతిపెద్ద తయారీదారుగా భారతదేశం అవతరించే అవకాశాలు ఎంతో దూరంలో లేవు. ప్రస్తుతం అమెరికన్ కంపెనీలకు సంబంధించిన విడిభాగాలు ఇక్కడే తయారవుతున్నాయి. పైగా భారత్ లో మానవనులు చాలా చవకగా లభిస్తుండటంతో దిగ్గజ కంపెనీలన్ని ఇక్కడే తమ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.
Also Read:World Population Day 2022: ప్రపంచ జనాభా దినోత్సవం స్పెషల్ స్టోరీ