https://oktelugu.com/

‘ఉప్పెన‌’ ట్విట్టర్ రివ్యూ.. అంతా సూప‌ర్‌.. అక్క‌డే తేడా!

సినిమా ఎవ‌రు తీసినా.. దానికి ప్ర‌మోష‌న్ కీల‌కం. ఇక‌, తొలిసారి ప‌రిచ‌యం అవుతున్న హీరోకు అది అత్యంత కీల‌కం. అయితే.. ఎంతో మంది ఇండ‌స్ట్రీలో లాంచ్ అవుతున్న‌ప్ప‌టికీ.. గ్రాండ్ లాంఛింగ్ మాత్రం కొంద‌రికే ద‌క్కుతుంది. అలా ఛాన్స్ పంజా వైష్ణ‌వ్ తేజ్ కు ద‌క్కింది. ఇలాంటి ఎంట్రీ వైష్ణ‌వ్ సోద‌రుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కు కూడా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం ‘ఉప్పెన’. భారీ ప్రమోషన్స్.. అంతే అంచనాల నడుమ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 12, 2021 11:25 am
    Follow us on

    Uppena Twitter Review
    సినిమా ఎవ‌రు తీసినా.. దానికి ప్ర‌మోష‌న్ కీల‌కం. ఇక‌, తొలిసారి ప‌రిచ‌యం అవుతున్న హీరోకు అది అత్యంత కీల‌కం. అయితే.. ఎంతో మంది ఇండ‌స్ట్రీలో లాంచ్ అవుతున్న‌ప్ప‌టికీ.. గ్రాండ్ లాంఛింగ్ మాత్రం కొంద‌రికే ద‌క్కుతుంది. అలా ఛాన్స్ పంజా వైష్ణ‌వ్ తేజ్ కు ద‌క్కింది. ఇలాంటి ఎంట్రీ వైష్ణ‌వ్ సోద‌రుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కు కూడా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం ‘ఉప్పెన’. భారీ ప్రమోషన్స్.. అంతే అంచనాల నడుమ ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యిందీ చిత్రం.

    ఈ సినిమా హీరోకు మాత్రమే కాదు.. అటు దర్శకుడికీ.. ఇటు హీరోయిన్ కు కూడా మొదటి చిత్రమే. దీంతో.. ఎలాంటి లీనియన్స్ లేకుండా.. ఫుల్ ఎఫర్ట్ తో ఈ చిత్రం కోసం పనిచేశారు. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు. ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. క‌న్న‌డ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. రాక్ స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ప్యూర్ లవ్ స్టోరీగా వ‌చ్చిన ఈ మూవీ గురించి ప్రేక్ష‌కుల ఫీలింగ్ ఏంటో చూద్దాం.

    చాలా మందికి ఈ సినిమా పేరు ప‌రిచ‌యం చేసింది.. ఈ చిత్రంలోని పాటే. మ్యూజిక్ సెన్సేష‌న్ డీఎస్ పీ గిటార్ నుంచి జాలువారిన ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట ఈ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. చాలా మంది ఈ పాట విన్న తర్వాతనే.. ఇది ఏ సినిమాలోనిది? అంటూ సినిమా గురించి ఆరాతీశారు. ఆ విధంగా యూట్యూబ్ లో దుమ్ములేపిందీ సాంగ్‌. ఆ త‌ర్వాత మ‌ధ్య‌లో వ‌దిలిన టీజర్, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేశాయి.

    Also Read: ఎక్స్ క్లూజివ్: ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా యంగ్ హీరో !

    మెగా ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ ఉండ‌డం.. సినిమాకు కూడా మంచి హైప్ రావ‌డంతో ‘ఉప్పెన’ బిజినెస్ కూడా బాగానే సాగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడు పోగా.. సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ.10 కోట్లు వరకూ అమ్ముడయ్యాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

    ఇప్పుడు థియేట‌ర్ల‌లో పెద్ద‌గా సినిమాలు కూడా లేక‌పోవ‌డం ‘ఉప్పెన’కు క‌లిసి వ‌చ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ అయ్యిందీ మూవీ. ఓవ‌ర్సీస్ తోపాటు ప‌లు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి. దీంతో.. సినిమా ఎలా ఉందో వెంట‌నే సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఆడియ‌న్స్‌. అయితే.. చాలా మంది మాత్రం పాజిటివ్ రిపోర్ట్సే కొట్టేస్తున్నారు. దీంతో.. తొలి రోజు మంచి క‌లెక్ష‌న్సు వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

    Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ.. రంగం సిద్ధం !

    మెగా హీరో నుంచి వ‌చ్చిన ప్ర‌తీ వార‌సుడికి త‌ప్ప‌కుండా మెగాస్టార్ తో కంపేరిజ‌న్ ఉంటుంది. అందుకే.. మెగా ట్రేడ్ మార్క్ అనేది ఒక‌ర‌కంగా ప్ల‌స్ అయితే.. మ‌రో విధంగా మైన‌స్ అవుతుంది. అంచ‌నాల‌ను రీచ్ అయితే స‌రే.. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. ఈ యాంగిల్ వైష్ణవ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు ఆడియ‌న్స్‌.

    ఓవ‌రాల్ గా అత‌డి న‌ట‌న‌కు మంచి మార్కులే వస్తున్నాయి. మొదటి సినిమానే అయినప్ప‌టికీ.. మంచి ఈజ్ తో న‌టించాడ‌ని చెబుతున్నారు. హీరోయిన్ కృతి శెట్టి కూడా కూడా మొద‌టి సినిమాలో చ‌క్క‌గా న‌టించింద‌ని, అందంతోపాటు అభిన‌యం కూడా క‌ల‌గ‌లిసిన కృతి.. త‌న‌ పాత్రకు న్యాయం చేసిందని అంటున్నారు. ఇక, త‌మిళ్ స్టార్‌ విజయ్ సేతుపతి నటన పీక్స్ అని చెబుతున్నారు.

    ఇక‌, ప్ర‌ధాన‌మైన డైరెక్ష‌న్ విభాగంపై అభిప్రాయం చెబుతూ.. బుచ్చిబాబు గురువు త‌గిన శిష్యుడు అనిపించుకున్న‌డ‌ని అంటున్నారు. బుచ్చిబాబు టేకింగ్ అద్భుతంగా ఉందని, ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా.. త‌న కాన్సెప్ట్ ను చ‌క్క‌గా వివ‌రించాడ‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. ఇక, మ్యూజిక్ సంచ‌ల‌నం దేవీ గురించి ఓ రేంజ్ లో చెబుతున్నారు. ఈ సినిమాకు ప్ర‌ధాన ఆయుప‌ట్టులో మ్యూజిక్ కూడా ఒక‌ట‌ని, డీఎస్ పీ అద్భుత‌మైన పాట‌ల‌తోపాటు బ్యాగ్రౌండ్ కూడా చాలా బాగా స్కోర్ చేశాడ‌ని అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అయితే.. అంతా బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్లైమాక్స్ మాత్ర‌మే కాస్త తేడాగా ఉంద‌ని అంటున్నారు. మెజారిటీ ఆడియ‌న్స్ ఈ ముగింపునే వేలెత్తి చూస్తుండ‌డం విశేషం. ఈ సినిమాలోని క్లైమాక్స్ కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ.. తెలుగు ప్రేక్ష‌కులు అంత‌గా క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. బుచ్చిబాబు రాసిన క్లైమాక్స్ ను సుకుమార్ మార్పించార‌ని ప్ర‌చారం సాగిన విష‌యం తెలిసిందే. క్లైమాక్స్ గురించి ఇలా డిస్క‌స్ జ‌ర‌గ‌డం కూడా ఈ రిజ‌ల్ట్ కు ఓ కార‌ణ‌మ‌ని అంటున్నారు. అయితే.. ఇది కూడా బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అంద‌రూ క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? ఓవ‌రాల్ గా ఈ చిత్రం ఎలాంటి రిజ‌ల్ట్ ను న‌మోదు చేస్తుంది? అన్న‌ది చూడాలి.