
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కివిడ్ 19 పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి వరకూ 10 మందికి కోవిడ్ సోకగా ఈ రోజు ఇద్దరికి కోవిడ్ 19 పాజిరివ్ గా తేలింది. దీంతో ఉద్యోగులు ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. మార్చి 22 అనంతరం లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే రెండు నెలల పాటు పనిచేశారు. మే మూడవ వారంలో 4వ విడత లాక్ డౌన్ లో ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో సీఎస్ ఆదేశాల ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. సచివాలయంలో ఉద్యోగుల రాక ప్రారంభమయ్యాక పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
దీంతో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఈ అంశంపై సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతుంది. మరో వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ సారి జరిగేవి బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉండటంతో ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇవ్వలేదు.
మరోవైపు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఆ శాఖ ఉద్యోగులకు రెండు వారాలపాటు ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. భయాందోళనలో ఉన్న మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగుల కూడా తమకు ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.