Rahul Gandhi Delhi Sweet Shop Owner: కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఎక్కడికి వెళ్లినా సరే ప్రధానంగా ఆయనకు ఎదురవుతున్న ప్రశ్న.. ఈ పెళ్లి ఎప్పుడు? సాక్షాత్తు ఈ ప్రశ్న ఇటీవల రాయబరేలి నియోజకవర్గానికి చెందిన మహిళలు కూడా సోనియాగాంధీని అడిగారు. దానికి ఆమె మంచి అమ్మాయి ఉంటే చూడండి అంటూ వారికి సమాధానం చెప్పారు. వారు చూశారో లేదో తెలియదు గాని ఇంతవరకు అయితే రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదు. ఆయనకు పెళ్లి చేసుకుని ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు.
రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో విదేశీ, స్వదేశీ పర్యటనలు చేస్తున్నారు. విదేశీ వేదికల మీద భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మండిపడుతున్నారు. ఎన్నికల సంఘం నుంచి మొదలుపెడితే రక్షణ శాఖ వరకు ప్రతి విభాగం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బిజెపి నాయకులు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ కి వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు మానసిక పరిపక్వత రాలేదని.. ఇకపై వచ్చే అవకాశం లేదని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు.. పత్యారోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి సంబంధించి ఏదో ఒక చర్చ అటు జాతీయ.. ఇటు స్థానిక మీడియాలో జరుగుతూనే ఉంటుంది.
రాహుల్ గాంధీ దీపావళి సందర్భంగా మీడియాలో ప్రముఖంగా కనిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విక్రాంత్ ప్రదర్శన చూస్తే.. రాహుల్ గాంధీ ఓ స్వీట్ షాప్ లో సందడి చేశారు. దీపావళి సందర్భంగా పాత ఢిల్లీలోని ప్రఖ్యాతమైన ఘంటేవాలా మిఠాయి దుకాణాన్ని రాహుల్ సందర్శించారు. అక్కడ జాంగ్రీలు, బేసన్ లడ్డూలు తయారు చేశారు. షాపీ యజమాని సుశాంత్ జైన్ తో సరదాగా మాట్లాడారు. జాంగ్రీలు తయారు చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ప్రొఫెషనల్ కుక్ మాదిరిగా దర్శనమిచ్చారు. అంతేకాదు లడ్డూలు తయారు చేసే విధానంలో కూడా తన నేర్పరితనాన్ని ప్రదర్శించారు. సుశాంత్ జైన్ రాహుల్ గాంధీతో సరదాగా మాట్లాడారు. రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పేర్కొన్నారు.”రాహుల్ జి మీరు త్వరగా పెళ్లి చేసుకోండి. ఆ వేడుకకు కచ్చితంగా మేమే మిఠాయిలు సరఫరా చేస్తాం. మీకు నచ్చిన మిఠాయిలను.. మీరు కోరుకున్న విధంగా.. పెళ్లికి వచ్చిన అతిథులకు అందజేస్తామని” జైన్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఇలా మిఠాయి దుకాణాలకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కొన్ని ప్రాంతాలలో ఇలాగే సందడి చేశారు. సరిగా పార్లమెంటు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ విలేజ్ కుకింగ్ ఛానల్ నిర్వాహకులతో మాట్లాడారు. వారితో కలిసి వంట కూడా చేశారు. అప్పట్లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.
पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।
सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है – ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।
दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ
— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025