Vikaruddin Incident In Jangaon: ప్రమోద్ అనే కానిస్టేబుల్ పై అత్యంత పాశవికంగా దాడి చేసి.. అతడి మరణానికి కారణమయ్యాడు పాత నేరస్థుడు రియాజ్. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రియాజ్ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకిని లాక్కొని కాల్చేందుకు ప్రయత్నించాడు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో రియాజ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు కావాలని అతడిని ఎన్కౌంటర్ చేశారని కొంతమంది అంటుంటే.. ఇప్పటికైనా ప్రమోద్ కుటుంబానికి న్యాయం జరిగిందని మరి కొంతమంది అంటున్నారు. ప్రమోద్ భార్య జరిగిన ఘటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రియాజ్ ఘటనను పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్రంలో 2015లో ఈ తరహా సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. జనగామ ప్రాంతంలో ఎస్కార్ట్ పోలీసులపై ఐదుగురు ఉ*గ్ర*వా*దు*లు తిరగబడ్డారు. దీంతో పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపితే వారు కన్నుమూశారు. అప్పట్లో తెలంగాణ పోలీసులు చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కోర్టుకు తీసుకెళ్తకుండగా ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావు ఇచ్చినప్పటికీ అంతిమంగా మాత్రం ఉగ్రవాదులు బలి కావడం సగటు ప్రజల్లో హర్షాన్ని నింపింది.
2017 ఏప్రిల్ 7న ఐ*ఎస్* ఐ ఉ*గ్ర*వా*ది*గా ఉన్న వికారుద్దీన్, అతడి అనుచరులను పోలీసులు జనగామ నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తున్నారు. ఈ సమయంలో జనగామ ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం పోలీసులు వాహనాన్ని ఆపారు. నిర్జన ప్రాంతంలో ప్రాంతంలో మూత్ర విసర్జన చేస్తుండగా వికారుద్దీన్ ఉన్నట్టుండి పోలీసులను బూతులు తిట్టాడు. ఆ తర్వాత ఓ పోలీస్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. మిగతా నలుగురు కూడా అదే స్థాయిలో ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా వికారుద్దీన్, అతని వెంట ఉన్న నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోయారు.
వికారుద్దీన్ అనేక నేరమయ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఉ*గ్ర*వా*దు*లకు సహకరిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందించాడు. కొంతమంది యువకులను తన దళంలో చేర్చుకున్నాడు. వారికి డబ్బు ఆశ చూపించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చాడు. ఈ వ్యవహారం మొత్తం కూడా పోలీసులకు తెలియడంతో వారు విచారణ జరిపారు. వికారుద్దీన్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. వాస్తవానికి పోలీసులను ప్రతిఘటిస్తే ఫలితం ఎలా ఉంటుందో 2015 నాటి వికారుద్దీన్ వుదంతం, వెటర్నరీ డాక్టర్ వ్యవహారం, తాజాగా రియాజ్ మరణం నిరూపిస్తున్నాయి.