https://oktelugu.com/

Delhi Polution: వామ్మో ఢిల్లీ.. కేంద్రం మరోసారి సీరియస్.. ఎందుకో తెలుసా..?

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. దీనిపై కేంద్రం తీవ్రంగా సీరియస్ అయ్యినట్లు సమాచారం. విషపూరితమైన పొగమంచు కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : November 7, 2024 2:07 pm
    Delhi Polution

    Delhi Polution

    Follow us on

    Delhi Polution: వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న నగరంగా దేశం రాజధాని ఢిల్లీ ఇదివరకే చేరింది. అయితే దీపావళి నుంచి దీని తీవ్రత మరింత పెరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మొత్తం పొగ కమ్ముకొని స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 356కు చేరింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు నాణ్యత తీవ్రంగా పడిపోయింది. గత నెలలోనే ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు స్పందించింది. కేంద్రానికి పలు సూచనలు చేసింది. కేంద్రం సరైన చర్యలు తీసుకోకపోవడంతో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతున్నదని అభిప్రాయ పడింది. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దరిమిలా కేంద్రం తీవ్రంగా స్పందించింది. వాయు కాలుష్యానికి తీవ్ర కారణాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అధికార యంత్రాగానికి పలు సూచనలు చేసింది, పోలీస్, తదితర శాఖలను అలర్ట్ చేసింది. పంటలు తగల బెట్టే వారిపై జరిమానాలకు ఉపక్రమించింది.

    ఈ దరిమిలా కేంద్రం సీరియస్ అయ్యింది. ఢిల్లీ సమీప ప్రాంతాల్లోని రైతులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. పంట వ్యర్థాలను దహనం చేస్తే జరిమానాను రూ. 30 వేల వరకు విధించాలని నిర్ణయించింది. దీనికి స్లాబుల వారీగా జరిమానాలను ప్రకటించింది. ది కమిషనర్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ చట్టం 2021 లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా ప్రస్తుతం తీవ్ర ప్రమాదకర పరిస్థితిలో ఢిల్లీ ఉందని కేంద్రం అభిప్రాయపడింది. వెంటనే కట్టడి చర్యలకు ఉపక్రమించింది. అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

    ఇప్పటికే ఢిల్లీలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు 15 శాతం పెరిగాయని అధికారులు గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధ పడే అవకాశం పెరుగుతుంది. గత పదేళ్లలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. గతవారం రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాల కారణంగా కూడా ఈ కాలుష్యం తీవ్రత మరింత పెరుగుతున్నదని అభిప్రాయపడుతున్నారు.

    ఏదేమైనా ఢిల్లీలో ఉంటే మనిషి ఆయుర్దాయం తగ్గడం ఖాయమని ఓ విద్యార్థి వాపోయాడు. తాను సివిల్స్ కోచింగ్ కోసం మహారాష్ర్ట నుంచి ఢిల్లీ వచ్చానని, కానీ ఇక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తున్నదని తెలిపాడు. పొగమంచు కారణంగా కూడా ఇబ్బందులు ఎదురైతున్నట్లు చెప్పాడు. గది నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తున్నదని తెలిపాడు. ఇక ఇనిస్టిట్యూట్ కు ఎలావెళ్లేదంటూ ప్రశ్నించాడు.