https://oktelugu.com/

Prabhas: మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్..చైన్ స్మోకింగ్ కూడా..వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ త్రెడ్ కి ట్విట్టర్ లో దాదాపుగా 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలా ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ గత వారం రోజులుగా నాన్ స్టాప్ ట్రోల్స్ వేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 02:01 PM IST

    Prabhas(4)

    Follow us on

    Prabhas: సోషల్ మీడియా లో ఇటీవల కాలంలో అల్లు అర్జున్, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరువురి హీరోల అభిమానులు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, ప్రభాస్, అల్లు అర్జున్ లను దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ ట్వీట్లు వేస్తున్నారు. అసలు గొడవ ఎక్కడ నుండి మొదలైంది అంటే ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీ షూటింగ్ కోసం ముంబై కి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ పార్టీ కి హాజరై బయటకు వస్తున్నాడు. ఆయనతో పాటు ‘వార్ 2’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ ని అయాన్ ముఖర్జీ కి ఇస్తాడు. ఈ వీడియో ని ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేస్తూ పెట్టగా అది సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఈ ట్రోల్స్ ని చూసి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు..?, వాళ్ళు కూడా ప్రభాస్ డ్రింకింగ్, స్మోకింగ్ చేస్తున్న ఫోటోలను వెతికి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. అవి వైరల్ అవ్వడంతో ఒక అల్లు అర్జున్ అభిమాని ఈ ఫొటోలన్నింటిని పోగు చేసి ఒక పెద్ద త్రెడ్ వేసాడు. దీనిని మీరు ఈ కథనం చివర్లో చూడొచ్చు.

    ఈ త్రెడ్ కి ట్విట్టర్ లో దాదాపుగా 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇలా ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ గత వారం రోజులుగా నాన్ స్టాప్ ట్రోల్స్ వేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో అది రుజువు అయ్యింది కూడా. కానీ అభిమానులు ఇలా ఎందుకు ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు పాన్ ఇండియన్ స్టార్ హీరోలు అవ్వడమే అందుకు కారణం. రికార్డ్స్ విషయంలో మా హీరో మీ హీరో కంటే పెద్ద తోపు దగ్గర నుండి గొడవలు మొదలు అవుతాయి, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది ప్రతీ హీరో విషయంలో జరుగుతున్నదే. సిగరెట్లు, మందు తాగడం వంటివి ఈరోజుల్లో సర్వసాధారణం. సామాన్యులే పని ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటారు. ఇక అంతటి పని ఒత్తిడిని తట్టుకొని నిలబడాలంటే సెలెబ్రెటీలకు ఆ మాత్రం అలవాటు ఉండడం వింతేమీ కాదు కదా.

    ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది కల్కి చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ప్రభాస్, ప్రస్తుతం రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆయన ‘సలార్ 2’ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన స్పిరిట్, కల్కి 2 వంటి చిత్రాలు కూడా చేయబోతున్నాడు. హను రాఘవపూడి, లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ వంటి వారితో కూడా ఆయన సినిమాలు సెట్ చేసుకున్నాడు.