Delhi Police: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొద్దిరోజుల క్రితం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన తో యావత్ దేశం ఉలిక్కిపడింది. మెట్రో సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకోవడంతో ఢిల్లీ నగర ప్రజలు భయకంపితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ చేస్తుండగా దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటన ఇలా ఉండగానే.. ఢిల్లీలో మరో పరిణామం వెలుగులోకి వచ్చింది.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ అగత్ 3.0 పేరుతో పలు ప్రాంతాలలో అర్ధరాత్రుల వేళల్లో తనిఖీలు మొదలుపెట్టారు. వీధి రౌడీలను, నేరస్తులను, వారితో పాటు సంబంధం ఉన్న వ్యక్తులను తనిఖీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండడానికి ముందస్తుగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఢిల్లీ పోలీసులు 285 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 21 పిస్టల్స్, 20 తూటాలు, 27 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు భారీగా మాదకద్రవ్యాలను, అక్రమంగా నిర్భవించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవన్నీ కూడా దొంగిలించిన వస్తువులని పోలీసులు గుర్తించారు. గతంలో శిక్ష అనుభవించినప్పటికీ చాలామంది నేరస్తులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. పైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు. ముఠాలుగా ఏర్పడి దారుణాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పోలీసుల తనిఖీలో తెలిశాయి. ప్రస్తుతం వారంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ నగరంలో చోటు చేసుకున్న నేరాలపై వారందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో కొందరికి ఆ నేరాలతో పరోక్షంగా ప్రమేయం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
మరి కొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి పోలీసులు ముందస్తుగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 285 మంది పట్టుబడడం విస్మయానికి గురి చేస్తోంది.
The Delhi Police apprehended hundreds of people and seized arms, drugs, illegal liquor, vehicles, money and much more in a major crackdown in the national capital’s South-East district on Saturday under ‘Operation Aaghat 3.0’.
Read FULL story: https://t.co/OI8tddGeO4 pic.twitter.com/VSzNn6pUQt
— Hindustan Times (@htTweets) December 27, 2025