Mumbai Adulterated Milk: మన నిత్యజీవితంలో పాలతో చేసే పనులు చాలా ఉంటాయి. కొందరేమో పాలతో టీ, కాఫీలు చేస్తుంటారు. ఇంకొందరేమో పాలను తాగుతుంటారు. పెరుగు నుంచి మొదలుపెడితే మిఠాయిల వరకు అన్నింటికి పాలనే వినియోగిస్తుంటారు. మనదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది.
పశుపోషణ ఖర్చు పెరిగిపోతున్న నేపథ్యంలో.. పాల ధర కూడా అదే స్థాయిలో ఉంటోంది. కొన్ని ప్రాంతాలలో పాల ఉత్పత్తి అంతగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు పాలను పశువుల నుంచి సేకరించడాన్ని పక్కనపెట్టి.. పాలను తయారు చేయడం మొదలుపెట్టారు. దీనికోసం ఎంత ప్రమాదకరమైన సబ్బులు, ఆయిల్, యూరియా మిశ్రమం పాలను తయారు చేస్తున్నారు. ఇలా రూపొందించిన మిశ్రమంలో పాలను కలిపి.. ఏమాత్రం అనుమానం రాకుండా చేస్తున్నారు. ఒక లీటర్ పాలను కొనుగోలు చేసి.. వాటిని ఏకంగా రెండు లీటర్లు చేస్తున్నారు.
పాలకూట విషం తయారు చేస్తున్న ఈ ఆక్రమార్కుల గుట్టును స్థానికులు రట్టు చేశారు.. ముంబై మహానగరంలోని అందేరి వెస్ట్ ప్రాంతంలో ఈ కల్తీ పాల రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో పాలను ఎలా విషం గా మార్చుతున్నారో ఈ వీడియో ద్వారా బయటపడింది. పాలను తయారు చేసే క్రమంలో డిటర్జెంట్ పౌడర్, యూరియా, సబ్బు నీళ్లు, రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారు. ఒక లీటర్ స్వచ్ఛమైన పాలు కొనుగోలు చేసి.. అందులో నీళ్లు, కెమికల్స్ కలుపుతూ రెండు లీటర్లుగా మారుస్తున్నారు.. వివిధ కేంద్రాల నుంచి వచ్చే పాల ప్యాకెట్లను తమ దగ్గరికి తెచ్చుకొని.. అత్యంత రహస్యమైన ప్రాంతాలలో ఆ పాలను ప్యాకెట్ల నుంచి తీసి కల్తీ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ పాలను కొత్త ప్యాకెట్లలో నింపి.. సరఫరా చేస్తున్నారు.
ఇలాంటి కల్తీపాలను తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మూత్రపిండాలు, కాలేయం పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. మహిళల్లో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. చర్మ వ్యాధులతో పాటు, కంటి సమస్యలు కూడా వస్తాయి. ముంబైలోని ఆ ప్రాంతంలో కల్తీపాల వ్యాపారం కొన్ని సంవత్సరాలుగా దర్జాగా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. వాస్తవానికి ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ అధికారులు మేం చెబితేనే దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
In Kapaswadi, Andheri West, Mumbai’s financial capital, the ⱥdulterⱥted milk mafia runs a shocking scam. Pure milk turns into a health hⱥzⱥrd as they dilute 1 liter into 2 with water and toxins—pøisøning kids’ glasses, women’s bones, and elders’ bodies. The system’s… pic.twitter.com/5HU6QyqzJx
— The Logical Indian (@LogicalIndians) December 27, 2025