KCR -MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కూతురు కోసం పార్టీ సిద్ధాంతానికి తిలోదకాలు కాలం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు. తన వారికి ఒక న్యాయం మిగతా వారికి ఇంకో న్యాయం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. చెప్పేందుకే నీతులు అని మరోసారి నిరూపించారు. తన కూతురు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బిజెపిని బద్నాం చేయాలని చూస్తున్నారు. కవిత లిక్కర్స్ కెమెరా విషయం ఆధారాలతో సహా ఈడీ కోర్టుకు చెబుతున్నా కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం కవిత తప్పే చేయలేదని బుకాయిస్తోంది.
బీజేపీలో చేరనందుకేనట..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రత్యక్షంగా మాట్లాడినట్లు హోటల్లో సమావేశమైనట్లు సెల్ఫోన్లు పగలగొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కెసిఆర్ అండ్ కో మాత్రం కవితకు సంబంధమే లేదన్నట్లు మాట్లాడుతున్నారు. పైగా బీజేపీలో చేరనందుకే కవితను టార్గెట్ చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. ‘బీజేపీలో చేరని వారిని కేంద్రం కేసులతో వేధిస్తోందని.. కవితను కూడా చేరమన్నరు’ అని కేసిఆర్ తెలిపారు. ‘ మహా అయితే ఏం చే స్తారు.. జైలుకు పంపుతారు అంతే కదా’ అని కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.
ఈడీ కేసులపైనే చర్చ..
బీఆర్ఎస్ కార్యవర్గ అత్యవసర సమావేశం శుక్రవారం ఏర్పాటు చేసిన కేసీఆర్ కవిత ఈడీ కేసుల అంశంపైనే ప్రధానంగా చర్చించారు. శనివారం కవితను అరెస్ట్ చేయొచ్చునని… చేసుకుంటే చేసుకోని అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ‘అందర్నీ వేధిస్తున్నారు.. భయపడేది లేదు.. పోరాటం వదిలేది లేదు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం ‘ అని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారు.. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారు.. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలి ‘ అని సూచించారు.
ముందస్తు ఆలిచన లేదు..
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని సీఎం కేసీఆర్ పార్టీ కార్యవర్గసభ్యులకు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలు సమావేశాలు పెట్టుకుని పాదయాత్రలు చేయాలని సూచించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
నిరసనలకు ప్లాన్..
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తే .. ఎలాంటి నిరసనలు చేయాలో కూడా కార్యవర్గ సమవేశంలో కేసిఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు కవిత శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఈడీ కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది. 32.5 శాతం వాటాకా సౌత్ గ్రూప్ లో కవితకు ఉందని.. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో..కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. శనివారం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Delhi liquor scam case kcr missed his word for his daughter
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com