Delhi election results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu nayudu), కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, ర్యాలీలు తీశారు. సభల్లో మాట్లాడారు. దీంతో తెలంగు ఓటర్లను కూడా బీజేపీవైపు తిప్పడంలో వీరు సక్సెస్ అయ్యారని ఫలితాల ట్రెండ్స్‌ను బట్టి తెలుస్తోంది. 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ప్రస్తుతం బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార ఆప్ కేవలం 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్(Magic figer) 36 దాటింది. అయితే మొదట ఓట్ల షేరింగ్‌లో భారీ ఆధిక్యం కనబర్చిన బీజేపీ క్రమంగా స్లో అయింది. ప్రస్తుతం బీజేపీ, ఆప్ మధ్య ఓట్ల శాతం కేవలం 2 తేడా మాత్రమే ఉంది. బీజేపీ 44 శాతం ఓట్లు సాధించగా, ఆప్ 42 శాతం ఓట్లు సాధించింది. సీట్లు మాత్రం బీజేపీ 45, ఆప్ 25 స్థానాల్లో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఒక్క సీటులో కూడా ఆధిక్యంలో లేదు.
ఏడీఏ భాగస్వామిగా ప్రచారం..
ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయకుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ప్రచారం చేశారు. అయితే చంద్రబాబు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఢిల్లీలోని షాదారా, విశ్వాస్‌నగర్, సంగం విహార్, సహద్ర నియోజకవర్గాల్లో ఏపీ సీఎం ప్రచారం చేశారు. వీటిలో ఒక్కటి మినహా మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.
కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు..
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అధికారం ఖాయం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ పదేళ్ల పాలనలో ఢిల్లీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో 1995 నాటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తెలుగువారు ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.
కేజ్రీవాల్ వెనుకంజ..
ఇక ప్రస్తుతం ఆప్ అధినేత కేజ్రీవాల్(Kegriwal)మళ్లీ వెనుకబడ్డారు. 8వ రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ 450 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేజ్రీవాల్ 4వ రౌండ్‌లో మాత్రమే 75 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. మిగతా ఏడు రౌండ్లలో కేజ్రీవాల్ వెనుకబడే ఉన్నారు. దీంతో అందరి దృష్టి ఈ స్థానంపై పడింది. పర్వేష్ వర్మ ఎన్నికల్లో గెలిస్తే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా బీజేపీ సీఎం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అన్నది రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ రేపుతోంది.