Mahesh Babu
Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ స్టార్ హీరోలు కొంతమందితో మాత్రమే సినిమాలను చేస్తూ ఉంటారు. కారణం ఏదైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో ఒక్క ఫ్లాప్ సినిమా పడినా కూడా స్టార్ హీరోల మార్కెట్ అనేది భారీగా పడిపోతుంది. తద్వారా వాళ్ళు ఆచితూచి ఏ దర్శకుడు అయితే వాళ్లకు సక్సెస్ ని ఇవ్వగలడో వాళ్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు… ఇక సూపర్ స్టార్ కృష్ణ(Krishna) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) లాంటి నటుడు సైతం కెరియర్ స్టార్టింగ్ లోనే మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోగా అవతరించాడు. ఇక ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్లీగా అతనితో మూవ్ అవుతున్నప్పటికి సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా మహేష్ బాబు మాత్రం రిజక్ట్ చేస్తూనే వచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే మెహర్ రమేష్ (Mehar Ramesh)ఇప్పటివరకు ఆయన చేసిన 5 సినిమాల్లో ఒక ‘బిల్లా ‘ (Billa) సినిమాని మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్లు కావడం విశేషం…
దాంతో అతనికి మహేష్ బాబు అవకాశాలు ఇవ్వలేకపోయాడు. ఇక ఆయన వల్ల జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) కి రెండు భారీ డిజాస్టర్లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఏది ఏమైనా కూడా మెహర్ రమేష్ పేరు చెప్తేనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు భయపడిపోతున్నారు.
ఇక చివరిగా మెగాస్టార్ లాంటి చిరంజీవితో ‘భోళా శంకర్’ (Bhola Shankar) అనే సినిమా చేసి దాన్ని కూడా డిజాస్టర్ గా మలిచిన ఘనత కూడా మెహర్ రమేష్ కే దక్కుతుంది…కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఆశామాషి గా రాదు. చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఒక సినిమాని అద్భుతంగా తెరకెక్కించినప్పుడు మాత్రమే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది.
అందుకోసమే దర్శకుడు అహర్నిశలు సినిమా కోసమే పరితపిస్తూ ఉండాలి. అంతే తప్ప ఇతర విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చాలామంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…