Chandu Mondeti : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ‘కార్తీకేయ 2’ (Karthikeya 2) సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చందు మొండేటి లాంటి దర్శకుడు సైతం తనదైన రీతులో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన నాగచైతన్య(Naga Chaiathnya), సాయి పల్లవి (Sai Pallavi) లను పెట్టి తండేల్ (Thandel) అనే సినిమా చేశాడు…రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్లడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఈయన కార్తీకేయ 2 సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి స్టార్ ప్రొడ్యూసర్ అతన్ని కలిసి ఒక మంచి కథను రెడీ చేయమని చెప్పాడట. అల్లు అర్జున్ కి కానీ రామ్ చరణ్ కి కానీ లేదంటే సూర్యకి సంబంధించిన ఏ స్టోరీ ఉన్న పర్లేదు వాళ్ళ డేట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఆయన సూర్యకి కూడా ఒక కథను వినిపించాడు. ఇక ఆ కథ కూడా సూర్యకి నచ్చడంతో తొందరగా సినిమాను స్టార్ట్ చేద్దామని అనుకున్నారట. ఇక ఇదే సమయంలో బన్నీ వాసు తండేల్ సినిమా స్టోరీ ఉందని అది వేరే దర్శకులతో చేయిస్తున్నానని చెప్పారట. ఇక ఆ స్టోరీ మీద కూడా చందు మొండేటి కొద్ది రోజులు వర్క్ చేశారట. దాంతో కథ మాటలు ఇచ్చి వేరే డైరెక్టర్ తో డైరెక్షన్ చేయిస్తానని నాగచైతన్యతో చందు మొండేటి చెప్పాడు. ఇక అప్పుడు నాగచైతన్య మాత్రం ప్రస్తుతానికి నువ్వు వేరే సినిమా చేయాల్సి ఉంటే చేసేయ్…
ఆ సినిమా పూర్తి అయ్యక నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు మనం ఈ సినిమా చేద్దాం అని చెప్పాడట. నువ్వు డైరెక్షన్ చేస్తేనే నేను ఈ సినిమా చేస్తా లేదంటే వద్దు అని చెప్పాడట…ఆ ఒక్క మాటతో చందు మొండిటి నాగ చైతన్య కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ఆసరాగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు.
మరి మొత్తానికైతే మంచి ఆఫర్ ని వద్దనుకొని నాగచైతన్యతో సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంతకుముందు నాగచైతన్య చందు మొండేటి మధ్య మంచి బాండింగ్ అయితే ఉండటమే దానికి కారణం అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా తండేల్ సినిమాతో వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి సక్సెస్ అయితే సాధించారు. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…