https://oktelugu.com/

రైతులతోపాటు దీక్ష చేయనున్న ఢిల్లీ సీఎం.. ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ సంస్కరణ పేరిట కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొద్దిరోజులుగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్నారు. పంజాబ్.. హర్యానా.. యూపీకి చెందిన రైతులలు ఢిల్లీలో దీక్షలు చేస్తున్న సంగతి తెల్సిందే..! Also Read: కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. అయోమయంలో ‘బండి’..! ఈక్రమంలోనే రైతులకు మద్దతుగా డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 06:27 PM IST
    Follow us on


    కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ సంస్కరణ పేరిట కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొద్దిరోజులుగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్నారు. పంజాబ్.. హర్యానా.. యూపీకి చెందిన రైతులలు ఢిల్లీలో దీక్షలు చేస్తున్న సంగతి తెల్సిందే..!

    Also Read: కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. అయోమయంలో ‘బండి’..!

    ఈక్రమంలోనే రైతులకు మద్దతుగా డిసెంబర్ 8న భారత్ బంద్ కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి విజయం చేశాయి. పలుమార్లు కేంద్రం రైతుల సంఘాల నాయకులతో చర్చలు జరిపినా ఫలితం రావడం లేదు.

    ఇప్పటికే రైతులకు రాజకీయ పార్టీలతోపాటు ప్రముఖ వ్యక్తులు.. సినీ సెలబ్రెటీలు రైతులకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న దీక్షలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెల్సిందే. భారత్ బంద్ సమయంలోనూ ఢిల్లీ సీఎంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

    Also Read: బీజేపీకి బంపరాఫర్ ఇస్తున్న కేసీఆర్.. వ్యూహంలో భాగమేనా?

    ఇదిలా ఉంటే సీఎం అరవింద్ క్రేజీవాల్ మరోసారి రైతు దీక్షల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం ఒక్కరోజు రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం నిరాహార దీక్షలో పాల్గొనబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

    సోమవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులు నిర్వహించే దీక్షలో తాను పాల్గొనబోతున్నట్లు అరవింద్ క్రేజ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్రం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినా ఫలితం రాకపోవడం గమనార్హం.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్