https://oktelugu.com/

అమెజాన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ.499కే పవర్ బ్యాంక్..?

దేశంలో యువత, విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే చాలామంది ఎంత ఖర్చు చేసి స్మార్ట్ ఫోన్ ను కొన్నా ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరగడం, ఎక్కువ సమయం గేమ్స్ ఆడటం వల్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. ప్రయాణ సమయాల్లో, ఇంట్లో కరెంట్ లేకపోతే ఛార్జింగ్ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. Also Read: పైసా లేకుండా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2020 / 06:21 PM IST
    Follow us on


    దేశంలో యువత, విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే చాలామంది ఎంత ఖర్చు చేసి స్మార్ట్ ఫోన్ ను కొన్నా ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరగడం, ఎక్కువ సమయం గేమ్స్ ఆడటం వల్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. ప్రయాణ సమయాల్లో, ఇంట్లో కరెంట్ లేకపోతే ఛార్జింగ్ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

    Also Read: పైసా లేకుండా షాపింగ్ చేస్తున్న మోసగాళ్లు.. నమ్మారో నిండా మునిగినట్టే..?

    అయితే పవర్ బ్యాంక్ లను వినియోగించడం ద్వారా ఛార్జింగ్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అమెజాన్ కస్టమర్లకు తక్కువ ధరకే పవర్ బ్యాంక్ లను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు తక్కువ ధరకే అమెజాన్ వెబ్ సైట్ లేదా యాప్ లో షాపింగ్ చేసి మంచి పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ బ్రాండెడ్ కంపెనీల పవర్ బ్యాంకులనే తక్కువ ధరకు అందిస్తూ ఉండటం గమనార్హం.

    Also Read: అమెజాన్ కస్టమర్లకు అలర్ట్.. ఆ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త..!

    రెడ్ మీ, ఆంబ్రేన్, సిస్కా, యూఆర్బీన్ పవర్ బ్యాంక్ లను అమెజాన్ ఈ సేల్ ద్వారా విక్రయిస్తోంది. ఈ సేల్ లో 10000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న యూఆర్బీఎన్ పవర్ బ్యాంక్ లు కేవలం 499 రూపాయలకే పొందవచ్చు. ఈ పవర్ బ్యాంక్ బరువు 354 గ్రాములు కాగా 12 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేయడం గమనార్హం. ఈ సేల్ లో అతితక్కువ ధరకు లభించే పవర్ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఎల్‌ఈడీ ఫ్లాష్ ‌లైట్ ఉన్న సిస్కా పవర్ బ్యాంక్ కూడా 599 రూపాయలకే 1000 ఎంఏహెచ్ కెపాసిటీతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఓవర్ ఛార్జింగ్ సౌకర్యాన్ని సైతం ఈ పవర్ బ్యాంక్ కల్పిస్తూ ఉండటం గమనార్హం. అంబ్రేన్ పవర్‌బ్యాంక్ 649 రూపాయలకు అమెజాన్ సేల్ ద్వారా పొందవచ్చు. రెండు ఔట్ పుట్ మరియు రెండు ఇన్ పుట్ పోర్టులు ఉన్న రెడ్ మీ పవర్ బ్యాంక్ ధర కేవలం 699 రూపాయలు కావడం గమనార్హం.