https://oktelugu.com/

Om Raut- Kriti Sanon: ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కి డైరెక్టర్ ఓం రౌత్ ముద్దులు…. మండిపడుతున్న జనాలు!

ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఆదిపురుష్ రామాయణ గాథగా తెరకెక్కింది. ప్రభాస్ రాఘవుడు పాత్ర చేస్తున్నారు. ఇక కృతి సనన్ జానకి పాత్ర చేస్తున్నారు. జానకిని చెరపట్టే లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఆదిపురుష్ మూవీ భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. వరుస పరాజయాల్లో ఉన్న ప్రభాస్ కి ఆదిపురుష్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Written By:
  • Shiva
  • , Updated On : June 7, 2023 / 04:05 PM IST

    Om Raut- Kriti Sanon

    Follow us on

    Om Raut- Kriti Sanon: ఒక్కోసారి తెలియక చేసిన పొరపాటు కూడా అతిపెద్ద కాంట్రవర్సీకి దారి తీయవచ్చు. దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ అలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు సోషల్ మీడియా వేదికగా ఇది హాట్ టాపిక్ అవుతుంది. జూన్ 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ తో పాటు ఇతర నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నిన్న ఈవెంట్ ముగియడంతో నేడు ఉదయం కృతి సనన్, ఓం రౌత్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

    కలిసి దర్శనం చేసుకున్నాక మీడియాకు ఫోజులిచ్చారు. ఇక సెండాఫ్ చెప్పుకుని వెళ్లిపోయే క్రమంలో అది తిరుమల అనే విషయం మర్చిపోయారు. ఎప్పటిలాగే మర్యాదపూర్వక హగ్, కిస్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. పవిత్ర తిరుమల గుడి పరిసరాల్లో ముద్దులు, హగ్గులు ఏంటని జనాలు మండిపడుతున్నారు. నిజానికి కృతి సనన్ ని హగ్ చేసుకున్న ఓం రౌత్ ఆలోచనలో ఎలాంటి తప్పులేదు. ఎప్పటిలాగే ఆయన వెళ్ళిపోబోతూ కృతి సనన్ ని కౌగలించుకుని, ముద్దాడాడు.

    అది వివాదాస్పదం అవుతుంది. సోషల్ మీడియాలో ఓం రౌత్, కృతి సనన్ లపై ఓ వర్గం దాడికి దిగింది. ఈ వివాదం మీద ఇంకా కృతి, ఓం రౌత్ స్పందించలేదు. వారు క్షమాపణ చెబుతారేమో చూడాలి. గతంలో నయనతార తెలియక శ్రీవారి మాడవీధుల్లో చెప్పులతో సంచరించారు. అది వివాదాస్పదామైంది. నయనతార దంపతులు తెలియక చేసిన తప్పని వేడుకోవడంతో వివాదం ముగిసింది.

    ఇక ఈ వివాదాలు పక్కన పెడితే… ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఆదిపురుష్ రామాయణ గాథగా తెరకెక్కింది. ప్రభాస్ రాఘవుడు పాత్ర చేస్తున్నారు. ఇక కృతి సనన్ జానకి పాత్ర చేస్తున్నారు. జానకిని చెరపట్టే లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఆదిపురుష్ మూవీ భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. వరుస పరాజయాల్లో ఉన్న ప్రభాస్ కి ఆదిపురుష్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.