BJP : ఎన్డీఏకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే..కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పుంజుకోవడం విశేషం. ఇది ముమ్మాటికీ ఎన్డీఏకు ప్రమాద ఘంటిక.మున్ముందు ఇలాంటి షాక్ లు తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా త్వరలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.అందులో ఏమాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చినా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు ఇబ్బందికరమే. కేవలం దేశంలో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. కానీ అధికారానికి అవసరమైన స్థానాలు దక్కించుకోలేదు.
2014లో తొలిసారిగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు రెండుసార్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు తీరలేదు. కానీ ఆ రికార్డును అధిగమించింది బిజెపి. అయితే మూడోసారి అధికారం అంత ఈజీగా దక్కలేదు. మిత్రపక్షాల మద్దతుతో నిలబడాల్సి వచ్చింది. తప్పకుండా స్నేహితులను పక్కన పెట్టుకొని ఈ ఐదేళ్ల పాలన పూర్తి చేయాలి. అయితే ముంచుకొస్తున్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. గతం మాదిరిగా సంచలన నిర్ణయాలు, సాహసోపేత చర్యలు చేపట్టడానికి వీలులేదు. తప్పకుండా మిత్రులందరికీ మద్దతు తీసుకోవాలి. జాతీయస్థాయి నిర్ణయాల విషయంలో మిత్రుల అనుమతి అవసరం కూడా.
గత పది సంవత్సరాల పాటు చాలా స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని నడిపారు మోది. కానీ ఇప్పుడు సంక్షోభాలు ఎదురవుతున్నాయి. ప్రత్యర్థుల బలం పెరుగుతోంది. మిత్రుల స్వరం మారుతోంది. గత పదేళ్లుగా బిజెపి బాధితరాజకీయ పార్టీలు సైతం యాక్టివ్ అవుతున్నాయి. ప్రత్యర్థులంతా ఒకే గూటికి చేరుతున్నారు. ఎన్నాళ్ళు పట్టించుకోని చంద్రబాబు లాంటి నేతలను సైతం బిజెపి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. ఒక్కో రాష్ట్రాన్ని బిజెపి వదులుకోవాల్సి వస్తోంది. మొన్న కర్ణాటకలో ఇదే మాదిరిగా అధికారాన్ని వదులుకుంది బిజెపి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బిజెపి పట్టు కోల్పోయింది. చాలా రాష్ట్రాల్లో ప్రమాదకర స్థితిలో ఉంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎన్ డి ఏ ప్రత్యర్థి పార్టీల్లో ఇప్పుడు ఐక్యత కనిపిస్తోంది.ఇండియా కూటమిలో మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని సహించలేని మిగతా రాజకీయ పక్షాలు.. ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్నాయి. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతోఆ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి.ఇది బిజెపికి ఇబ్బందికర పరిణామమే.కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే.. గత పదేళ్లలో బిజెపి బాధిత పార్టీలన్నీ హస్తం గూటికి చేరడం ఖాయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీఅధికారానికి దగ్గరగా వస్తే.. బిజెపి పతనం ప్రారంభం కావడం ఖాయం. అయితే ఇప్పటివరకు ఉత్తరాధి రాష్ట్రాలనే బిజెపి నమ్ముకుంది.ఇప్పుడు అదే రాష్ట్రాల్లో బిజెపికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. చివరకు బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ప్రతికూల ఫలితాలు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి మిత్రులు చాలా తక్కువ.బిజెపికి నమ్ముకున్న చాలా పార్టీలు మూల్యం చెల్లించుకున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ ఇదే మాదిరిగా మూల్యం చెల్లించుకున్నారు. నమ్మదగిన మిత్రులుగా ఉన్నటువంటి పార్టీలనే విభజించింది బీజేపీ. ఏకంగా నాయకత్వాలపై తిరుగుబాటు చేయించింది. అందుకే బిజెపితో స్నేహం అంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు ఏర్పడింది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దేశంలో బిజెపి గ్రాఫ్ పడిపోతున్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా పదేళ్ల కిందట అంతులేని గ్రాఫ్ తో ప్రధానిగా ఎంపికయ్యారు మోడీ. కానీ దశాబ్ద కాలంలో పరిస్థితి తారు మారయ్యింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Decreasing bjp graph in the country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com