https://oktelugu.com/

తీన్మార్ మల్లన్న సంచలన ‘అడుగులు’

తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాను తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించాడు. ఇక పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రకు కార్యాచరణ మొదలుపెట్టాడు. వీరే కాదు.. వైఎస్ఆర్ టీపీ అంటూ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒకేసారి ముగ్గురు కీలక నేతలు తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న వేళ.. ప్రజా ఉద్యమకారుడు, జర్నలిస్ట్ అయిన తీన్మార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2021 / 08:46 PM IST
    Follow us on

    తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాను తెలంగాణలో పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించాడు. ఇక పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి సైతం పాదయాత్రకు కార్యాచరణ మొదలుపెట్టాడు.

    వీరే కాదు.. వైఎస్ఆర్ టీపీ అంటూ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒకేసారి ముగ్గురు కీలక నేతలు తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న వేళ.. ప్రజా ఉద్యమకారుడు, జర్నలిస్ట్ అయిన తీన్మార్ మల్లన్న సైతం రంగంలోకి దిగాడు. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది.

    ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సామాజిక అంశాలపై ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు సంచలనమవుతున్నాయి. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. టీవీల్లో తీన్మార్ మల్లన్నగా తెలంగాణ గృహాల్లో ప్రసిద్ది చెందాడు. సామాజిక.. రాజకీయ సమస్యలపై అతని తరచుగా వ్యంగ్యంగా ధైర్యంగా వ్యాఖ్యానాలు చేస్తుంటాడు.

    తీన్మార్ మల్లన్న ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా వరంగల్ స్తానం నుంచి అధికార టీఆర్ఎస్ కే ముచ్చెమటలు పట్టించారు. ఒకటిన్నర సంవత్సరాల క్రితం జరిగిన హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అతనికి కేవలం 894 ఓట్లు వచ్చాయి. ఇది నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ. కానీ ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి తాజాగా ఎమ్మెల్సీగా పోటీచేసిన మల్లన్న పాలక తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొంటున్నాడు. అంత డబ్బు పరపతి ఉన్న పార్టీకి ముచ్చెమటలు పట్టించాడు.

    తాజాగా తీన్మార్‌ మల్లన్న కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అభిమానులతో మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో 6వేల కి.మీల పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపాడు. తీన్మార్ మల్లన్న టీం పేరిట రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

    పాదయాత్రకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ కొందరు నేతలు ఆహ్వానించారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్‌ చేశారు.