DCP Joel Davis Vs Raghunandan Rao: జూబ్లీహిల్స్ లో మైనర్ పై అత్యాచారం జరిగిన ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా రఘునందన్ రావు, ఏసీపీ జోయల్ డేవిస్ పేర్లు మార్మోగాయి. బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత ఏఎస్పి జోయల్ డేవిస్ విలేకరుల ముందుకు వచ్చి ఎమ్మెల్యే కొడుకుకి క్లీన్ చీట్ ఇచ్చారు . తర్వాత మరుసటి రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘటనకు సంబంధించి వీడియో క్లిప్లు విలేకర్లకు చూపించారు. ఆ తర్వాతే అత్యాచార ఘటనలో దర్యాప్తు వేగంగా సాగింది. వాస్తవానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దుబ్బాక ఉపఎన్నికల అప్పుడే ఈ మధ్య వైరం మొదలైంది. తాజాగా జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటనతో అది ఇంకా ముదిరి పాకాన పడింది.

అప్పుడు ఏం జరిగిందంటే
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు, అదే జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న జోయల్ డేవిస్ మధ్య వైరం మొదలైంది. అప్పట్లో రఘునందన్రావు బంధువు ఇంట్లో నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. జోయల్ డేవిస్ కూడా ఒక అడుగు ముందుకేసి ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు మైలేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారుల అండదండలతో జోయల్ డేవిస్ రఘునందన్ రావు ను దొరకబుచ్చుకావాలని ప్రయత్నం చేసినా ఎక్కడ అతను చిక్కలేదు. దీనికితోడు మంత్రి హరీష్ రావు కూడా సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించినా రఘునందన్ రావు తేలిగ్గానే బయటపడ్డారు.
Also Read: Pawan Kalyan- Vehicles: మనల్ని ఎవడ్రా ఆపేది.. బరిలోకి పవన్ కళ్యాణ్ కొత్త వాహనాలు
ఎస్పీ కార్యాలయం ఎదుట తొడగొట్టిన రఘునందన్ రావు
ఉప ఎన్నికలు, ఆ తర్వాత వెల్లడించిన ఫలితాల్లో రఘునందన్ రావు సమీప టిఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు. విజయం సాధించిన నాడే ర్యాలీలో సిద్దిపేట ఏసీపీ ఆఫీస్ ఎదురుగా రఘునందన్ రావు తొడగొట్టి మీసం మెలేశారు. అక్కడ కార్యకర్తలు బాణసంచా కాల్చి నానా హంగామా సృష్టించారు. ఆ సమయంలో రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ విజయాన్ని జోయల్ డేవిస్ కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జోయల్ డేవిస్ సంగతి చూస్తాను అని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలు ఫిర్యాదు చేస్తే వారం తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరైన ఎమ్మెల్యే కొడుక్కి వత్తాసు పలికారు.

ఏసీపీ జోయల్ డేవిస్ ఒక అడుగు ముందుకేసి ఎమ్మెల్యే కొడుకుకు క్లీన్చిట్ ఇచ్చారు. సరిగ్గా అదును కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు మరుసటి రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుక్కి వత్తాసు పలుకుతున్నారని, జోయల్ డేవిస్ క్లీన్చిట్ ఇవ్వడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. ఒకానొక దశలో రఘునందన్ రావు జోయల్ డేవిస్ మీద విరుచుకు పడ్డారు. అతను పోలీసు ఉద్యోగానికి పనికిరాడని, అధికార పార్టీ కార్యాలయంలో పని చేసేందుకు మాత్రమే ఉపయోగపడతాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎప్పుడైతే రఘునందన్రావు విలేకరుల ముందు ఫోటోలు పెట్టారో అప్పుడే ఈ కేసు రకరకాల మలుపులు తీసుకుంది.
మొదట్లో బెంజ్ కార్ అని, తర్వాత ఇన్నోవా కార్ అని బుకాయించిన పోలీసులు.. రఘునందన్రావు విలేకరుల సమావేశం తర్వాత అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ ఎపిసోడ్లో మొదట అభాసుపాలైంది జోయల్ డేవిస్. ఆయన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చారని కారణంతోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యారు. నాడు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు ను జోయల్ డేవిస్ ను ముప్పు తిప్పలు పెట్టారు. తర్వాత జూబ్లీహిల్స్ ఘటనలో సరైన సాక్ష్యాధారాలు సంపాదించి జోయల్ డేవిస్ ను రఘునందన్రావు ఇరుకున పెట్టారు. కాగా జోయల్ డేవిస్, రఘునందన్ రావు ఉదంతాన్ని ఉమ్మడి ఏపీలో అప్పటి వరంగల్ ఎస్పీ నలిన్ ప్రభాత్, కాంగ్రెస్ నాయకుడు కొండ మురళి మధ్య నెలకొన్న వైరంతో పోల్చి చూస్తున్నారు. అప్పట్లో ఓ కేసు విషయంలో కొండ మురళి నిందితుడిగా ఉన్నారు. ఆ క్రమంలోనే ఎస్పీ నలీన్ ప్రభాత్ తో విభేదాలు మొదలయ్యాయి. అది చినికిచినికి గాలివానలా మారాయి. ఒకానొక దశలో ఎస్పి నలీన్ ప్రభాత్ కొండ మురళి పై చేయి చేసుకోవడం అప్పటి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది.

నిందితులకు బిర్యాని పెట్టారు
ఇక జూబ్లీహిల్స్ మైనర్పై అత్యాచారం కేసు విషయానికి వస్తే.. నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు.. సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం విచారణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిందితులకు బిర్యానీ తెప్పించడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి విచారణలో ఉన్న ఖైదీలకు నిబంధనల ప్రకారమే ఆహారం పెడతారు. కానీ బాలిక అత్యాచార ఘటనలో నిందితులకు అమీర్పేట నుంచి ప్రత్యేకంగా బిర్యాని పార్సల్ తెప్పించి వడ్డించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బిజెపి నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండగా అధికార టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అధికార టీఆర్ఎస్ పార్టీకి జాగిలం గా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించడం చర్చకు దారితీసింది. కాగా తమ ఆధీనంలో ఉన్న నిందితులు కోరినందునే బిర్యాని ప్యాకెట్లు తెప్పించమని పోలీసులు చెబుతుండటం గమనార్హం.
Also Read:Jubilee Hills Incident: బాలిక గ్యాంగ్ రేప్: మొదట లైంగిక దాడి చేసింది ఆయన కుమారుడేనట!