https://oktelugu.com/

అజ్ఞాతవ్య‌క్తిలా తండ్రికి బెదిరింపు.. రూ.కోటి ఇవ్వాల‌న్న‌ కూతురు..!

ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తిలా తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది కూతురు. నాకు అర్జెంటుగా కోటి రూపాయ‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే.. నీ కొడుకును, కూతురిని చంపేస్తాను అని మెసేజ్ లో రాసింది. ఇది చూసిన తండ్రి తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. ఎవ‌రు చేశారీ ప‌ని అనేది అర్థంకాక కంగారుపడ్డాడు. ఎంత ప్ర‌య‌త్నించినా.. అర్థంకాక‌పోవ‌డంతో పోలీస్ స్టేష‌న్ కు ప‌రుగులు తీశాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ […]

Written By:
  • Rocky
  • , Updated On : August 1, 2021 / 02:45 PM IST
    Follow us on

    ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తిలా తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది కూతురు. నాకు అర్జెంటుగా కోటి రూపాయ‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే.. నీ కొడుకును, కూతురిని చంపేస్తాను అని మెసేజ్ లో రాసింది. ఇది చూసిన తండ్రి తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. ఎవ‌రు చేశారీ ప‌ని అనేది అర్థంకాక కంగారుపడ్డాడు.

    ఎంత ప్ర‌య‌త్నించినా.. అర్థంకాక‌పోవ‌డంతో పోలీస్ స్టేష‌న్ కు ప‌రుగులు తీశాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ మెసేజ్ ఎవ‌రు చేశారు? ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌ని ఆరాతీయ‌డం మొద‌లు పెట్టారు. దీంతో.. చివ‌ర‌కు క‌నిపెట్టారు. ఆ మెసేజ్ చేసింది ఎవ‌రో కాదు ఆయ‌న కూతురే! అది కూడా.. తండ్రి ల్యాప్ టాప్ నుంచే ఆ మెజేస్ పంపించింది. ఈ విష‌యం తెలిసిన కుటుంబ స‌భ్యులు నిర్ఘాంత‌పోయారు.

    ఇలా ఎందుకు చేసింద‌నేగా మీ డౌట్‌? దానికి కారణం ఉంది. చెప్పిన ప‌ని చేయ‌లేదో.. మ‌రేదైనా కార‌ణ‌మోగానీ.. త‌ల్లిదండ్రులు ఆ అమ్మాయిని మంద‌లించారు. దీంతో.. మ‌న‌స్తాపానికి గురైన బాలిక.. త‌న కోపాన్ని ఇలా తీర్చుకుంద‌న్న‌మాట‌. ఎంత కోపం వ‌స్తే మాత్రం.. మ‌రీ ఇలాంటి ప‌నిచేయ‌డ‌మేంటీ అనుకుంటున్నారా? ఆమె వ‌య‌సు అలాంటిది మ‌రి! అవును.. ఆ పాప వ‌యసు 11 సంవ‌త్స‌రాలు!

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గ‌జియాబాద్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మొత్తానికి అప్ప‌టి వ‌ర‌కు హ‌డ‌లిపోయిన కుటుంబ స‌భ్యులు, పోలీసులు.. అస‌లు విష‌యం తెలిసి నివ్వెర పోయారు. ఆ త‌ర్వాత ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఇంకోసారి ఇలా చేయొద్ద‌ని హెచ్చ‌రించారు.