Homeఆంధ్రప్రదేశ్‌Union Budget 2026: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలమ్మ ఏం కేటాయించారు? జరిగే మార్పులు ఇవే..

Union Budget 2026: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలమ్మ ఏం కేటాయించారు? జరిగే మార్పులు ఇవే..

Union Budget 2026: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. వచ్చే పది సంవత్సరాలను ఉద్దేశించి నిర్మల మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అందువల్లే బడ్జెట్ కేటాయింపులలో ఆమె కొన్ని రంగాలకు సింహభాగం కేటాయింపులు జరిపారు.

బడ్జెట్లో సహజంగానే తెలుగు రాష్ట్రాలకు ఏం జరిగింది.. కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేసింది.. అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈసారి కూడా నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలపరంగా ఎటువంటి కేటాయింపులు నిర్మల జరిపారు.. అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే..

కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ నగరం నుంచి హై స్పీడ్ రైలు కారిడార్ వెళ్తుందని నిర్మల ప్రకటించారు. దీనివల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే ఏపీలో అమరావతికి స్పెషల్ ఫండ్స్ కేటాయించలేదు నిర్మల. హైదరాబాద్ మెట్రో కూడా ఇటువంటి ఫండ్స్ ఇవ్వలేదు. హైదరాబాద్ నగరానికి రైలు కారిడార్ మాత్రమే కాకుండా, టూరిజం కారిడార్, రేర్ ఎర్త్ కారిడార్ వంటి వాటిని కేటాయించారు. హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరుకు.. పూణే, చెన్నై మధ్య కేంద్రం కారిడార్ నిర్మిస్తోంది. ఇక ఇదే సమయంలో ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ నిర్మిస్తోంది. బడ్జెట్లో కొన్ని అభివృద్ధి పనులకు నిర్మల నిధులు కేటాయిస్తున్నటు ప్రకటించారు.

మౌంటెన్ ట్రేకింగ్, ఎకో ట్రయల్స్, అరకులో పర్యావరణహితమైన మౌంటెన్ ట్రయల్స్ ను కేంద్రం డెవలప్ చేస్తుంది. ట్రెక్కింగ్ కోసం అరకు ప్రాంతాన్ని కేంద్రం గుర్తించింది. పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాచింగ్ ట్రయల్స్ ను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. హై స్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ నగరం ప్రత్యక్షంగా లబ్ధిని పొందితే.. దక్షిణాంధ్ర ప్రాంతం పరోక్షంగా కనెక్టివిటీని సొంతం చేసుకుంటుంది.

ఇంటిగ్రేటెడ్ కారిడార్ నిర్మించడం ద్వారా ఆంధ్ర తీర ప్రాంతంలో నౌకాశ్రయాలు అభివృద్ధి చెందుతాయి.. రేర్ ఎర్త్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్స్, మైనింగ్ ప్రాసెసింగ్ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తారు..

ఇటీవల కేంద్రం ఆర్థిక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వచ్చిన ఫలితాలు ఆధారంగా ఏపీలో అమరావతి నిర్మాణం వేగవంతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపులు జరపలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version