spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Dastagiri: జ‌గ‌న్ అనుకుంటే ప‌ది రోజుల ప‌ని.. వైఎస్ వివేక హ‌త్య కేసుపై ద‌స్త‌గిరి సంచ‌ల‌న...

Dastagiri: జ‌గ‌న్ అనుకుంటే ప‌ది రోజుల ప‌ని.. వైఎస్ వివేక హ‌త్య కేసుపై ద‌స్త‌గిరి సంచ‌ల‌న వ్యాఖ్య !

Dastagiri
Dastagiri

Dastagiri: అత‌ను వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క నిందితుడు. హ‌త్యలో ప్ర‌ధాన పాత్ర‌దారుడు. ఒక‌ప్పుడు వైఎస్ వివేకానంద‌రెడ్డికి విశ్వాస‌పాత్రుడు. విశ్వాస‌ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. తాగిన మైకంలో చేసిన త‌ప్పు తెలుసుకున్నాడు. కేసులో అప్రూవ‌ర్ గా మారాడు. నిందితుల‌ను తేల్చడానికి సీబీఐ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌క‌రిస్తున్నాడు. ఇప్పుడు అత‌ను చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఓ పార్టీలో తెలియ‌ని గుబులు పుట్టిస్తున్నాయి. ఇంత‌కీ అత‌నెవ‌రు ? ఆ వ్యాఖ్య‌లేంటో తెలుసుకోండి.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో షేక్ ద‌స్త‌గిరి ప్ర‌ధాన పాత్ర‌ధారుడు. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో వివేకా ఇంట్లోనే ఉన్నాడు. న‌మ్మ‌క‌స్తుడు కావ‌డంతో వివేకా ఇంట్లోకి రానిచ్చాడు. మిగిలిన వారితో క‌లిసి వివేకాను పాశ‌వికంగా హ‌త్య చేశాడు. కానీ తాగిన మైకంలో చేసిన త‌ప్పును తెలుసుకున్నాడు. హ‌త్య కేసు వెనుక బ‌ల‌మైన శ‌క్తులు ఉన్నా భ‌య‌ప‌డ‌కుండా నిజాల‌ను బ‌హిర్గ‌త‌ప‌రిచేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కేసులో అప్రూవ‌ర్ గా మారిపోయాడు. సీబీఐకు త‌న‌కున్న స‌మాచారాన్ని ఇప్ప‌టికే అందించాడు. ద‌స్త‌గిరి స‌మాచారం మేర‌కు సీబీఐ అధికారులు కేసును ముందుకు తీసుకెళ్తున్నారు.

వైఎస్ వివేకా హ‌త్య కేసు హైద‌రాబాద్ కు మార్చ‌డంతో స‌మ‌న్లు తీసుకునేందుకు ద‌స్త‌గిరి ఆదివారం సీబీఐ కార్యాల‌యానికి వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ కేసులోని దోషుల్ని తేల్చాల‌నుకుంటే ప‌ది రోజుల‌కు మించి స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నాడు. సీబీఐ అధికారులు వారి వ‌ద్ద ఉన్న స‌మాచారం మేర‌కే అనుమానితుల్ని విచారిస్తున్నార‌ని తెలిపాడు. స‌మాచారం లేకుండా ఎవ‌రినీ ఊరిక‌నే విచారించ‌ర‌ని చెప్పాడు. త్వ‌ర‌లో నిజానిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నాడు. కేసు ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కావ‌డం మంచిద‌ని అన్నాడు. కేసులో ఎవ‌రి పాత్ర ఏంట‌నేది కాల్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు తేల్చుతార‌ని చెప్పాడు.

Dastagiri
Dastagiri

ఇప్ప‌టికే వైఎస్ వివేకా హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని, జ‌గ‌న్ ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న‌రెడ్డిని, భార‌తీ పీఏ న‌వీన్ ను సీబీఐ అధికారులు విచారించారు. వీరి త‌ర్వాత మ‌రికొంత మంది కీల‌క వ్య‌క్తుల‌ను సీబీఐ అధికారులు విచార‌ణ‌కు పిలుస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయంగా ఉన్న‌త‌స్థాయి వ్య‌క్తులు కూడా త్వ‌ర‌లో విచార‌ణ‌కు వెళ్లాల్సి వ‌స్తోంద‌ని తెలుస్తోంది. దీంతో వైసీపీలో వ‌ణుకుపుడుతోంది. షేక్ ద‌స్త‌గ‌రి వ్యాఖ్య‌లు దీనికి మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. అయితే సీబీఐ ఏమేర‌కు కేసును వేగ‌వంతంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం పై కేసు పురోగ‌తి ఆధార‌ప‌డి ఉంటుంది.

ఇప్ప‌టికే విచార‌ణ ఎదుర్కొంటున్నా వ్య‌క్తులు ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం న‌డుపుతున్న‌ట్టు తెలుస్తోంది. కేసులో విచార‌ణ‌కు నోటీసులు రాగానే ఢిల్లీ వైపు ప‌రుగెత్త‌డం ఇందుకేన‌ని ప్రచారం జ‌రుగుతోంది. త‌ప్పు చేయ‌ని వారు విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తే సొమ్మేం పోతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. త‌ప్పు చేసిన‌వారే భుజాలు త‌డుముకుంటార‌ని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ వివేకా హ‌త్య కేసు సీబీఐ కోర్టులో ఉంది. మ‌రి ఉన్న‌త‌స్థాయి ఒత్తిళ్ల‌తో కేసు ఆల‌స్యం అవుతుందా ? నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రుగుతుందా ? అన్న చ‌ర్చ ఏపీలో జ‌రుగుతోంది.

 

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper